ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని బాక్స్ ఆఫీస్ దగ్గర 2019 ఇయర్ లో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఊరమాస్ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకుని ఫుల్ జోష్ మీద ఉండగా తర్వాత తమిళ్ లో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న తడం సినిమా ను తెలుగు లో రెడ్ పేరుతో రీమేక్ చేయగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సమ్మర్ మొదట్లో రిలీజ్ అవ్వాల్సి ఉన్నా కరోనా వలన పోస్ట్ పోన్ అవుతూ రాగా సినిమా ఇప్పుడు సంక్రాంతి కి…
రిలీజ్ కానుంది అని చెప్పారు కానీ ఇప్పటి వరకు కొత్త అప్ డేట్స్ ఏవి చెప్పడం లేదు, దాంతో సినిమా ఇప్పుడు సంక్రాంతి రేసు నుండి సమ్మర్ రేసులో ఎంటర్ కాబోతుంది అని టాక్ చక్కర్లు కొడుతుండగా సినిమా బడ్జెట్ మొత్తం మీద 23 కోట్ల రేంజ్ లో జరగగా…
సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ తోనే ఆల్ మోస్ట్ బడ్జెట్ ని రికవరీ చేశాడు ఎనర్జిటిక్ స్టార్ ఇప్పుడు. రెడ్ మూవీ తెలుగు శాటిలైట్ రైట్స్ ని 8.5 కోట్లకు అమ్మగా అలాగే డిజిటల్ రైట్స్ ని 5 కోట్లకు అమ్మారు, దాంతో ఈ రెండు కలిపే ఏకంగా 13.5 కోట్లు రికవరీ అవ్వగా ఇప్పుడు….
హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా అమ్ముడు పోయాయి. అది కూడా సాలిడ్ రేటు కి అని చెప్పొచ్చు. రామ్ సినిమాలను హిందీ లో సాలిడ్ క్రేజ్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే, దాంతో ఈ సినిమా కి 8.5 కోట్ల రేటు హిందీ డబ్బింగ్ రైట్స్ కింద సొంతం అయ్యింది అని సమాచారం. దాంతో ఓవరాల్ గా బిజినెస్ ఇప్పుడు 22 కోట్ల రేంజ్ లో జరిగింది అని చెప్పాలి.
దాంతో ఓవరాల్ గా 23 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన రామ్ రెడ్ మూవీ నాన్ థియేట్రికల్ బిజినెస్ కింద 22 కోట్లు రికవరీ చేయగా మ్యూజిక్ రైట్స్ బిజినెస్ లెక్కలు తేలాల్సి ఉన్నాయి. ఇక థియేట్రికల్ బిజినెస్ కూడా బాలెన్స్ ఉండగా కరోనా టైం లో కూడా ఈ సినిమా తో మంచి ప్రాఫిట్స్ ని నిర్మాత కి దక్కేలా చేశాడు రామ్…