Home గాసిప్స్ రామ్ రెడ్ OTT బజ్…అనుకున్నదొక్కటి-అయ్యిందొక్కటి!

రామ్ రెడ్ OTT బజ్…అనుకున్నదొక్కటి-అయ్యిందొక్కటి!

0

ఇస్మార్ట్ శంకర్ సినిమా తో బాక్స్ ఆఫీస్ దగ్గర తొలి బిగ్గెస్ట్ మాస్ హిట్ ని సొంతం చేసుకోవడమే కాకుండా కెరీర్ లో తొలిసారి 40 కోట్ల షేర్ మార్క్ ని కూడా అందుకుని దుమ్ము దుమారం చేశాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్. ఈ సినిమా తర్వాత తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన తడం సినిమాను తెలుగు లో రెడ్ పేరుతో రీమేక్ చేయగా… సమ్మర్ కానుకగా రిలీజ్ అవ్వాల్సిన…

ఈ సినిమా కరోనా ఎఫెక్ట్ వలన పోస్ట్ పోన్ అవ్వగా… సినిమాను ముందు థియేటర్స్ లో రిలీజ్ అనుకున్నారు. ఇలాంటి టైం లో OTT ఆఫర్స్ వెల్లువగా వచ్చి పడ్డాయి. ఒక్క బిగ్ మూవీ డైరెక్ట్ రిలీజ్ కి ఒప్పుకుంటే మిగిలిన సినిమాలు రేసులోకి ఎంటర్ అవుతాయని…

OTT యాప్స్ భారీ ఆఫర్స్ ని అన్ని సినిమాలకు ఇవ్వగా ఈ సినిమా కి కూడా ఆల్ మోస్ట్ 26-28 కోట్ల రేంజ్ ఆఫర్స్ దక్కినప్పటికీ హీరో రామ్ కి సినిమా థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలనీ ఉండగా నిర్మాత స్రవంతి రవికిషోర్ మంచి ఆఫర్ వస్తుండటంతో ఇలా రిలీజ్ చేయడం ఉత్తమం అని కన్విన్స్ చేసే లోపు…

నాని వి మూవీ డిజిటల్ రిలీజ్ ని కన్ఫాం చేసుకోవడంతో ఇప్పుడు రామ్ రెడ్ మూవీ కి ముందు అనుకున్నట్లు OTT ఆఫర్స్ రావడం లేదట. నిర్మాత బెటర్ ఆఫర్ కోసం ఇప్పుడు ఎదురు చూస్తున్నాడు అని టాలీవుడ్ లో వార్తలు శిఖారు చేస్తున్నాయి. రామ్ కూడా ఇదే బెస్ట్ ఆఫర్ అనుకుంటేనే అమ్ముదామని…

లేదా థియేటర్స్ ఓపెన్ చేశాక రిలీజ్ చేద్దామని నిర్మాతకి చెబుతున్నారట. రామ్ ప్రీవియస్ మూవీస్ బిజినెస్ లతో పోల్చితే 26-28 కోట్ల రేంజ్ ఆఫర్ చాలా ఎక్కువే అని చెప్పాలి. కానీ అప్పుడు నో చెప్పడంతో ఇప్పుడు పరిస్థితులు మారాయని అంటున్నారు. మరి రెడ్ మూవీ ఫైనల్ గా OTT వైపే వెళుతుందా లేక థియేటర్స్ కి వస్తుందా అన్న కన్ఫ్యూజన్ ఇంకా కొనసాగుతుందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here