Home గాసిప్స్ అప్పుడు 23 కోట్లు…ఇప్పుడు 28 కోట్లు….కాచుకోండి ఇక!!

అప్పుడు 23 కోట్లు…ఇప్పుడు 28 కోట్లు….కాచుకోండి ఇక!!

0

ఎనర్జిటిక్ స్టార్ రామ్ లాస్ట్ ఇయర్ ఇస్మార్ట్ శంకర్ సినిమా తో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కొట్టడమే కాదు… కెరీర్ లో మొట్ట మొదటి 40 కోట్ల షేర్ మార్క్ ని కూడా అందుకుని సంచలనం సృష్టించాడు. ఇక ఈ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత తమిళ్ లో సూపర్ హిట్ అయిన తడం సినిమా ను తెలుగు లో రెడ్ పేరుతొ రీమేక్ చేయగా… సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటె సమ్మర్ లో…

రిలీజ్ అయ్యి ఉండేది కానీ పరిస్థితులు ఎఫెక్ట్ కొట్టడం తో నిరవధికంగా పోస్ట్ పోన్ అయిన ఈ సినిమా కి అన్ని పనులు కూడా పూర్తీ అవ్వడం తో మంచి మంచి డిజిటల్ రిలీజ్ ఆఫర్స్ దక్కుతున్నా కానీ నిర్మాతలు నో చెబుతున్నారు.

ఇది వరకు సినిమా కి 23 కోట్ల రేంజ్ లో డిజిటల్ రిలీజ్ కి ఆఫర్ దక్కగా నో చెప్పారు. దాంతో రేటు మెల్లి మెల్లిగా పెంచుతూ ఇప్పుడు ఏకంగా 28 కోట్ల రేంజ్ రేటు ఆఫర్ లు ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కి గాను దక్కుతున్నాయని అంటున్నారు.

ప్రస్తుతం రామ్ మార్కెట్ చూసుకున్నా కానీ లాస్ద్ట్ ఇయర్ వచ్చిన ఇస్మార్ట్ శంకర్ 17.7 కోట్ల బిజినెస్ నే సొంతం చేసుకుని భారీ లాభాలాను సొంతం చేసుకుంది. దాంతో పోల్చితే 23 కోట్లే సాలిడ్ ఆఫర్ అంటే ఇప్పుడు ఏకంగా 28 కోట్ల రేంజ్ ఆఫర్ అంటే బెస్ట్ డీల్ అనే చెప్పాలి. కానీ యూనిట్ మాత్రం దీనిపై ఇంకా ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదని తెలుస్తుంది.

లేట్ అయినా కానీ థియేటర్స్ లో రిలీజ్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ ఇయర్ ఎండ్ వరకు కూడా పరిస్థితులు సద్దుకోక పొతే అప్పుడు ఆలోచిద్దామని అనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే ఇతర టాలీవుడ్ మూవీస్ రేంజ్ ని బట్టి చూస్తె రెడ్ మూవీ కి బెస్ట్ డీల్ వచ్చిందనే చెప్పాలి. మరి ఫైనల్ గా యూనిట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here