ఈ మధ్య కాలం లో టాలీవుడ్ లో వచ్చిన ఏ సినిమాలకు కూడా టెలివిజన్ లో అనుకున్న రేంజ్ లో రేటింగ్ లు సొంతం అవ్వడం లేదు, ఎంత మంచి హిట్ అయినా కానీ ఇది వరకటిలా భారీ రేటింగ్ లు సొంతం అవ్వడం లేదు. అలాంటి టైం లో అప్పుడప్పుడు కొన్ని సినిమాలు కొంచం పర్వాలేదు అనిపించేలా రేటింగ్ లను సొంతం చేసుకుంటూ ఉన్నాయి. ఇప్పటి వాటిలో ఇప్పుడు ఉస్తాద్….
రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ ది వారియర్ కూడా ఒకటిగా చేరింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిసాస్టర్ గా నిలిచింది. 39 కోట్ల రేంజ్ బిజినెస్ లో మొత్తం మీద పరుగు కంప్లీట్ అయ్యే టైం కి 21.65 కోట్లు మాత్రమే వసూల్ చేసి…
ఏకంగా 17.35 కోట్లు నష్టపోయి డిసాస్టర్ గా నిలిచిన ఈ సినిమాను రీసెంట్ గా భారీ రేటు కి ముందే కొన్న స్టార్ మా ఛానెల్ వాళ్ళు మంచి ప్రమోషన్స్ చేసి టెలికాస్ట్ చేశారు, ఆల్ రెడీ డిసాస్టర్ మూవీ కి రేటింగ్ పెద్దగా ఏమి రాదేమో అని అందరూ అనుకున్నా కానీ…
ది వారియర్ సినిమా కి ఫస్ట్ టైం టెలికాస్ట్ లో 10.02 టి.ఆర్.పి రేటింగ్ సొంతం అయ్యింది. ఇది మరీ అద్బుతం కాదు కానీ రీసెంట్ టైం మూవీస్ రేటింగ్ లను బట్టి అలాగే ది వారియర్ రిజల్ట్ ను బట్టి చెప్పాలి అంటే ఎక్స్ లెంట్ రేటింగ్ అనే చెప్పాలి… ఇక లాంగ్ రన్ లో టెలివిజన్ లో సినిమా ఇలానే జోరు చూపిస్తే ఛానెల్ కి లాభాలు ఖాయమని చెప్పొచ్చు.