Home న్యూస్ ఇదేం క్రేజ్ రా బాబు…132 కోట్లు ఏంటి సామి…అరాచకం!!

ఇదేం క్రేజ్ రా బాబు…132 కోట్లు ఏంటి సామి…అరాచకం!!

0

యంగ్ హీరోల్లో నార్త్ సైడ్ విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్న హీరోగా మన హీరోల్లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనికి సాలిడ్ క్రేజ్ ఉందని చెప్పాలి…. రామ్ నటించిన సినిమాలు వరుస పెట్టి హిందీలో రిలీజ్ అవ్వడం అక్కడ అవలీలగా 100 మిలియన్ మార్క్ ని అందుకుంటూ రచ్చ చేయడం మామూలు అయిపొయింది… టాలీవుడ్ హీరోలలో ఎక్కువ సార్లు అక్కడ 100 మిలియన్ వ్యూస్ రికార్డు కానీ…. మిలియన్స్ లో లైక్స్ కానీ సొంతం చేసుకున్న స్టార్ గా….

RED The Film 9 Days Total Worldwide Collections!

రామ్ పోతినేని సంచలన రికార్డ్ ను సొంతం చేసుకోగా అక్కడ రామ్ నటించిన సినిమాల్లో డబ్ అయ్యి హైయెస్ట్ వ్యూస్ ని సొంతం చేసుకున్న టాప్ 4 మూవీస్ ఓవరాల్ గా వ్యూస్ అన్నీ కలిపి ఏకంగా 130 కోట్ల వ్యూస్ మార్క్ ని అందుకుని ఊహకందని ఊచకోత కోసింది అని చెప్పాలి…

RED The Film 10 Days Total Worldwide Collections!

రామ్ నటించిన సినిమాలలో నేను శైలజ సినిమా అక్కడ ది సూపర్ ఖిలాడీ పేరుతొ డబ్ అయ్యి ఇప్పటి వరకు 43.5 కోట్ల వ్యూస్ ని సొంతం చేసుకోగా తర్వాత ప్లేస్ లో హలో గురు ప్రేమ కోసమే సినిమా దందార్ ఖిలాడీ పేరుతొ డబ్ అయ్యి అక్కడ 40 కోట్ల వ్యూస్ ని…

సొంతం చేసుకుని దుమ్ము లేపింది. ఈ సినిమా తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమా 25.2 కోట్ల వ్యూస్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండగా ఉన్నది ఒకటే జిందగీ సినిమా అక్కడ నంబర్ 1 దిల్ వాలా పేరుతొ డబ్ అయ్యి ఇప్పటి వరకు 23.5 కోట్ల వ్యూస్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపడం విషయం.

కేవలం ఈ నాలుగు సినిమాల కౌంట్ చూసుకుంటే ఏకంగా 132.2 కోట్ల వ్యూస్ ని సొంతం చేసుకోగా ఇంకా రామ్ నటించిన ఇతర సినిమాల వ్యూస్ కూడా సాలిడ్ గానే ఉండటం విశేషం. రామ్ క్రేజ్ చూస్తె త్వరలో హిందీ లో కూడా తన సినిమాను డబ్ చేసి రిలీజ్ చేసే అవకాశం కూడా ఉందని చెప్పొచ్చు. తన లేటెస్ట్ మూవీ ది వారియర్ త్వరలోనే బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేయడానికి సిద్ధం అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here