Home న్యూస్ 2 ఏళ్లుగా హిట్ లేదు…అయినా రణరంగం బిజినెస్ కుమ్మింది!!

2 ఏళ్లుగా హిట్ లేదు…అయినా రణరంగం బిజినెస్ కుమ్మింది!!

0

     2017 లో మహానుభావుడు సినిమా తో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న శర్వానంద్ తర్వాత చేసిన పడిపడి లేచే మనసు లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో రాగా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయిన ఆ సినిమా ఫ్లాఫ్ గా మిగిలిపోగా ఆ తర్వాత కొంచం టీం తీసుకుని సుదీర్ వర్మ డైరెక్షన్ లో ఇప్పుడు రణరంగం అంటూ డిఫెరెంట్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు శర్వానంద్. ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమా పై అంచనాలు బాగానే పెరిగాయి.

దాంతో రెండేళ్లుగా హిట్ లేకున్నా కానీ ఈ సినిమా బిజినెస్ బాగానే జరిగింది అని చెప్పాలి. నైజాం లో 5 కోట్లు, సీడెడ్ లో 2 కోట్లు, టోటల్ ఆంధ్రా లో 6 కోట్ల దాకా బిజినెస్ చేసిన ఈ సినిమా టోటల్ గా రెండు తెలుగు రాష్ట్రాలలో 13 కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ ని సొంతం చేసుకుంది.

ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా లో కలిపి 1.2 కోట్లు, టోటల్ ఓవర్సీస్ లో 1.8 కోట్ల దాకా బిజినెస్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 16 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ని సొంతం చేసుకుంది. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు సినిమా 17 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగుతుంది అని చెప్పాలి.

ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ థియేటర్ కౌంట్ కూడా 700 వరకు ఉంటుందని అంచనా. అందులో రెండు తెలుగు రాష్ట్రాలలోనే 500 వరకు థియేటర్స్ లో సినిమా రిలీజ్ అవుతుండగా మిగిలిన ఇండియా లో అలాగే ఓవర్సీస్ లో కలిపి ఫైనల్ లెక్క 700 వరకు వెలుతుందట.

బాక్స్ ఆఫీస్ దగ్గర బజ్ పర్వాలేదు అనిపించే విధంగా ఉన్నా బుకింగ్స్ యావరేజ్ గానే ఉన్నాయి, దాంతో సినిమా ఎక్కువగా మౌత్ టాక్ పైనే డిపెండ్ అయ్యి రిలీజ్ కానుంది. పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ఈ బిజినెస్ ని అందుకోవడం లాంగ్ రన్ లో పెద్ద కష్టమేమి కాదని చెప్పొచ్చు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here