Home న్యూస్ గూడచారి కన్నా డబుల్ బిజినెస్…ఎవరు సినిమా దుమ్ము లేపింది!

గూడచారి కన్నా డబుల్ బిజినెస్…ఎవరు సినిమా దుమ్ము లేపింది!

854
0

       డిఫెరెంట్ కాన్సెప్ట్ మూవీస్ ని ఎంచుకుంటూ ఒక్కో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటూ సినిమా సినిమా కి మెల్లి మెల్లిగా తన క్రేజ్ ని పెంచుకుంటూ పోతున్న హీరో అడవి శేష్, క్షణం, లాస్ట్ ఇయర్ గూడచారి సినిమాల తో మంచి విజయాలను తన ఖాతాలో వేసుకున్న అడవి శేష్ ఇప్పుడు మరో డిఫెరెంట్ కాన్సెప్ట్ మూవీ అయిన ఎవరు సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సినిమా స్పానిష్ లో హిట్ అయిన….

ది ఇన్విజిబుల్ గెస్ట్ అనే బ్లాక్ బస్టర్ సినిమా కి రీమేక్, ఇదే సినిమాను హిందీ లో అమితాబ్ మరియి తాప్సీ ల కాంబినేషన్ లో బద్లా పేరు తో రీమేక్ చేయగా అక్కడ సూపర్ హిట్ అయ్యింది, ఇప్పుడు ఆ కథ లో కొన్ని మార్పులు చేసి తెలుగు లో ఎవరు గా తీర్చిదిద్దారు.

కాగా ఈ సినిమా కి బిజినెస్ పరంగా అద్బుతమైన బిజినెస్ అన్ని ఏరియాల్లో జరిగింది అని చెప్పొచ్చు. అడవి శేష్ లాస్ట్ మూవీ గూడచారి టోటల్ బిజినెస్ 5 కోట్ల రేంజ్ లోనే జరగగా ఈ సినిమా కి మొత్తం మీద 10 కోట్ల బిజినెస్ జరిగింది, అందులో నైజాం లో 2.8 కోట్లు,

సీడెడ్ లో 1.8 కోట్లు టోటల్ ఆంధ్రా లో 3.7 కోట్ల బిజినెస్ ని అందుకున్న సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 7.7 కోట్ల బిజినెస్ ని అందుకుంది, ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 65 లక్షలు, ఓవర్సీస్ మొత్తం మీద 65 లక్షల బిజినెస్ తో టోటల్ వరల్డ్ వైడ్ బిజినెస్ 10 కోట్ల మార్క్ ని అందుకుంది.

దాంతో 11 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగుతున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 550 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుందట. అందులో రెండు తెలుగు రాష్ట్రాలలో 400 లోపు థియేటర్స్ లో రిలీజ్ కానుందట. మరి ఈ సినిమా అడవి శేష్ మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుంటాడో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here