బాక్స్ ఆఫీస్ దగ్గర మార్చ్ 26 వీకెండ్ లో రెండు క్రేజీ మూవీస్ పోటి పడ్డాయి, సమ్మర్ రేసులో మిగిలిన సినిమాల కన్నా ముందు రిలీజ్ ను సొంతం చేసుకుని ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ రెండు సినిమాలు మంచి బజ్ ను సొంతం చేసుకోగా రెండు సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ మూడు రోజుల ముందే మొదలు అయినా కానీ బుకింగ్స్ యావరేజ్ గానే సాగాయి, రంగ్ దే బుకింగ్స్ కొంచం బెటర్ గా ఉండగా…
అరణ్య కి బుకింగ్స్ పెద్దగా జరగలేదు, దాంతో రెండూ కూడా మౌత్ టాక్ పైనే డిపెండ్ అయ్యి రిలీజ్ అవ్వగా ఓపెనింగ్స్ విషయానికి వస్తే రెండు సినిమాలకు మార్నింగ్ షోలకు దెబ్బ పడింది, ఆంధ్రప్రదేశ్ లో భారత్ బంద్ ఇంపాక్ట్ వలన మార్నింగ్ షోలకు కాన్సిల్ చేశారు. కానీ… మ్యాట్నీ షోల నుండి…
తిరిగి రెగ్యులర్ గా షోలు పడగా రెండు సినిమాలు కూడా వేటి రేంజ్ లో అవి బాగానే పెర్ఫార్మ్ చేస్తున్నాయి. ముఖ్యంగా రంగ్ దే సినిమా మొదటి షోల నుండే మంచి హోల్డ్ తో రోజును బాగానే కొనసాగించగా ఈవినింగ్ షోలకు వచ్చే సరికి మరింత బాగా గ్రోత్ ని చూపెట్టి…
దూసుకు పోతుంది. దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో అవలీలగా 3.8 కోట్లకు పైగా షేర్ ని అందుకోవడం కన్ఫాం కాగా ఆ లెక్క 4 కోట్ల మార్క్ ని అంతకు మించి ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఆఫ్ లైన్ లెక్కలను బట్టి కలెక్షన్స్ ఇంకా పెరగొచ్చు… ఇక అరణ్య మూవీ ఏ సెంటర్స్ లో బాగానే ఉన్నప్పటికీ కూడా…
బి సి సెంటర్స్ లో మాత్రం చాలా లో ఓపెనింగ్స్ ని సాధించింది. కానీ చాలా సెంటర్స్ లో ఈ సినిమా కి కూడా టికెట్ హైక్స్ ఉండటం తో సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు 1.2 కోట్లకు పైగా కలెక్షన్స్ ని సాధించవచ్చు. ఓవరాల్ గా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ఇంపాక్ట్ తో మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. మరి అఫీషియల్ గా రెండు సినిమాల ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.