Home న్యూస్ 18 నెలల్లో 6 సినిమాలు ఫ్లాఫ్….ఇక ఆశలన్నీ ఈ సినిమా పైనే!!

18 నెలల్లో 6 సినిమాలు ఫ్లాఫ్….ఇక ఆశలన్నీ ఈ సినిమా పైనే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక్క సినిమా హిట్ అయితే వరుస పెట్టి సినిమా ఆఫర్స్ ఎవరికైనా వస్తాయి, హీరోయిన్స్ కి అయితే ఇండస్ట్రీలో తక్కువ టైం ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువగా ఆఫర్స్ ని ఒప్పుకుంటూ ఉంటారు…. 2018 ఇయర్ లో మహానటి సినిమా ఊహకందని విజయాన్ని సొంతం చేసుకోవడంతో కీర్తి సురేష్ కి ఇన్స్టంట్ గా వరుస పెట్టి ఆఫర్స్ వచ్చాయి. వాటిలో ఎక్కువ శాతం లేడీ ఓరియెంటెడ్ మూవీస్ ఒప్పుకోగా….

అందులో చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అలాగే డిజిటల్ లో 2020 సెకెండ్ ఆఫ్ నుండి ఇప్పటి వరకు రిలీజ్ అయ్యాయి… కానీ ఇక్కడ విచారకరమైన వార్తా ఏంటంటే అన్నింటికి అన్ని సినిమాలు కూడా అన్ని చోట్లా ఫ్లాఫ్ టాక్ నే సొంతం చేసుకోవడం అని చెప్పాలి…

ముందుగా పెంగ్విన్ సినిమా డైరెక్ట్ గా డిజిటల్ లో రిలీజ్ అవ్వగా ఆ సినిమా టాక్ నెగటివ్ గానే ఉన్నప్పటికీ వ్యూవర్ షిప్ బాగానే సొంతం అవ్వగా తర్వాత మిస్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుని తీవ్రంగా నిరాశ పరిచింది అని చెప్పాలి…

తర్వాత వెంటనే నితిన్ తో కలిసి చేసిన రంగ్ దే సినిమా పర్వాలేదు అనిపించే టాక్ ని సొంతం చేసుకున్నా కానీ బాక్స్ ఆఫీస్ రిజల్ట్ మాత్రం డిసాస్టర్ గానే మిగిలి పోయింది… ఇక తర్వాత రీసెంట్ గా మోహన్ లాల్ నటించిన మరక్కర్ సినిమాలో రోల్ చేయగా ఆ సినిమా కూడా డిసాస్టర్ అవ్వగా సూపర్ స్టార్ రజినీతో చేసిన పెద్దన్న సినిమా కూడా….

బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ అయింది, ఇక ఇప్పుడు ఆడియన్స్ ముందుకు గుడ్ లక్ సఖితో వచ్చిన కీర్తికి మరోసారి నిరాశనే మిగలగా 18 నెలల గ్యాప్ లో ఆల్ మోస్ట్ 6 సినిమాలు నిరాశ పరిచే రిజల్ట్ తో డబుల్ హాట్రిక్ ఫ్లాఫ్స్ ని మూట గట్టుకుంది కీర్తి సురేష్. ఇలాంటి టైం లో సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న సర్కారు వారి పాట పైనే ఆశలన్నీ పెట్టుకుంది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here