యూత్ స్టార్ నితిన్ కీర్తి సురేష్ ల కాంబినేషన్ లో వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా రంగ్ దే, అన్నీ అనుకున్నట్లు జరిగితే సమ్మర్ కానుకగా రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా కరోనా వలన మిగిలిన సినిమాల మాదిరిగానే పోస్ట్ పోన్ అవ్వగా సినిమాను డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ చేయడానికి గట్టి ప్రయత్నాలే జరిగాయి, కానీ మేకర్స్ సరైన టైం లో స్పందించక పోవడం తో రేటు కూడా తగ్గుతూ వచ్చింది.
తర్వాత జీ 5 వాళ్ళు పే పెర్ వ్యూ పద్దతిలో సినిమాను రిలీజ్ చేయాలనీ కూడా ట్రై చేశారు కానీ అప్పటికే ఆ పద్దతిలో రిలీజ్ అయిన సినిమాల పరిస్థితి చూసి ఆ రూట్ లో వద్దే వద్దు అని టీం చెప్పడం తో సినిమా డిలే మరింత అవ్వగా సినిమా ను ఇక సంక్రాంతి బరిలో…
భారీ గా రిలీజ్ చేయాలి అని భావించారు కానీ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. ఇక సినిమా బిజినెస్ గురించిన అప్ డేట్ ఇప్పుడు ట్రేడ్ లో చక్కర్లు కొడుతుంది, ఆ అప్ డేట్ ప్రకారం సినిమా ను జీ నెట్ వర్క్ వాళ్ళు సొంతం చేసుకున్నారు అని అంటున్నారు.
సినిమా కి సంభందించిన శాటిలైట్, డిజిటల్, హిందీ డబ్బింగ్ మరియు థియేట్రికల్ బిజినెస్ తో సహా అన్ని హక్కులను ఇప్పుడు జీ నెట్ వర్క్ వాళ్ళు గంప గుత్తుగా సొంతం చేసుకున్నారని సమాచారం. అందుకుగాను మొత్తం మీద ఇప్పుడు 38 కోట్ల నుండి 40 కోట్ల మధ్యలో డీల్ సెట్ అయ్యింది అని ట్రేడ్ లో టాక్ గట్టిగా వినిపిస్తుంది. థియేట్రికల్ బిజినెస్ లో కూడా అడుగు పెట్టాలని…
ఫిక్స్ అయిన జీ నెట్ వర్క్ వాళ్ళు వరుస పెట్టి సినిమాల అన్ని హక్కులను సొంతం చేసుకుంటున్నారు. సోలో బ్రతుకే సో బెటర్ ఇప్పుడు రంగ్ దే సినిమాల హక్కులను సొంతం చేసుకున్న జీ నెట్ వర్క్ ఇప్పుడు రంగ్ దే సినిమా ను జనవరి ఎండ్ టైం లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజం అవుతుందో తెలియాల్సి ఉంది.