బాక్స్ ఆఫీస్ దగ్గర 2018 టైంలో రిలీజ్ అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటించిన రంగస్థలం(Rangasthalam) సినిమా ఏ రేంజ్ లో రచ్చ చేసిందో అందరికీ తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన ఈ సినిమా వచ్చిన ఇయర్ ఎండ్ లోనే…
కన్నడ నుండి వచ్చిన కేజిఎఫ్(KGF Chapter1) సినిమా అనూహ్య విజయాన్ని అన్ని చోట్లా సొంతం చేసుకోగా తర్వాత వచ్చిన కేజిఎఫ్2(KGF Chapter2) ఊహకందని కలెక్షన్స్ తో ఊచకోత కోసింది. ఇప్పుడు ఈ సినిమాలు అన్నీ కూడా జపాన్ లో…
శుక్రవారం భారీ ఎత్తున రిలీజ్ అవ్వగా ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ రిపోర్ట్స్ బయటికి రాగా ఆ బుకింగ్స్ చూసిన తర్వాత బిగ్గెస్ట్ మాస్ హిట్ అయిన కేజిఎఫ్ సిరీస్ మీద రంగస్థలం సినిమా ఊచకోత కోసేలా జోరు చూపిస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం…
కేజిఎఫ్ చాప్టర్ 1 కి 1 మిలియన్ దాకా అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ సొంతం అవ్వగా కేజిఎఫ్ చాప్టర్ 2 కి 650K జపాన్ యెన్స్ మాత్రమే సొంతం అయ్యాయి. ఇక రంగస్థలం సినిమా మాత్రం ఏకంగా 2.5 మిలియన్ జపాన్ యెన్స్ గ్రాస్ ను సొంతం చేసుకుని ఆశ్యర్యపరిచింది.
రెండు పార్టులు కలిపినా కేజిఎఫ్ కన్నా కూడా రంగస్థలం సినిమా ఎక్స్ లెంట్ బుకింగ్స్ ను సొంతం చేసుకోగా ఎలాగూ టాక్ బానే వచ్చే అవకాశం ఉండటంతో రంగస్థలం రాంపేజ్ జపాన్ లో కొనసాగే అవకాశం ఉంది. కేజిఎఫ్ సిరీస్ కూడా జోరు అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. మరి వీకెండ్ లో ఏ సినిమా జోరు చూపిస్తుందో చూడాలి.
Total collection Japan tho saha pettu anna