Home గాసిప్స్ తమిళ్ లో డబ్ కానున్న రంగస్థలం…మళ్ళీ ఊచకోత ఖాయం!!

తమిళ్ లో డబ్ కానున్న రంగస్థలం…మళ్ళీ ఊచకోత ఖాయం!!

0

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ రంగస్థలం తెలుగు నాట ఎలాంటి సెన్సేషనల్ కలెక్షన్స్ ని సాధించిందో అందరికీ తెలిసిందే. సరికొత్త ఇండస్ట్రీ రికార్డులను నమోదు చేసిన ఈ సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 2018 కరువు సమయంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని ఇచ్చి ఏకంగా 127.5 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ ని సాధించి శెభాష్ అనిపించుకుంది.

కాగా తెలుగు వర్షన్ తోనే తమిళ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు అక్కడ డబ్ అయ్యి రిలీజ్ కానుంది. తమిళ్ నేటివిటీ కి దగ్గరగా ఉండే రంగస్థలం కచ్చితంగా తమిళ్ లో వర్కౌంట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పొచ్చు.

రీసెంట్ గా మహేష్ బాబు భరత్ అనే నేను కూడా అక్కడ డబ్ అయ్యి రిలీజ్ అవుతున్న నేపద్యంలో రంగస్థలం సినిమా కూడా డబ్ అవుతుండటం తో మార్కెట్ ఎక్స్ పాన్షన్ మరింతగా జరిగే అవకాశం ఉంది. రిలీజ్ డేట్ ఇంకా పక్కా గా ఫిక్స్ కాలేదు కానీ త్వరలోనే ఏదో ఒకటి తేలే అవకాశం పుష్కలంగా ఉందని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here