Home గాసిప్స్ మెగాస్టార్ సినిమా స్టొరీ పాయింట్ తో రవితేజ కొత్త సినిమా!!

మెగాస్టార్ సినిమా స్టొరీ పాయింట్ తో రవితేజ కొత్త సినిమా!!

0

మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం వరుస ఫ్లాఫుల్లో ఉన్నాడు, బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తుండగా ఫ్యాన్స్ కూడా ఎప్పుడెప్పుడు రవితేజ సెన్సేషనల్ కంబ్యాక్ ఇస్తాడా అని ఎదురు చూస్తున్నారు. ఇక రవితేజ ప్రస్తుతం క్రాక్ సినిమా ఆల్ మోస్ట్ కంప్లీట్ చేయగా తర్వాత చేయబోతున్న సినిమాలు కూడా ఒక్కొటిగా కమిట్ అవుతున్నాడు. అందులో రమేష్ వర్మ డైరెక్షన్ లో ఒక సినిమా ఉండగా… మరో సినిమా ను…

త్రినాధ రావ్ నక్కిన డైరెక్షన్ లో చేయబోతున్నాడు… రమేష్ వర్మ సినిమా మాస్ మసాలా మూవీ కాగా త్రినాధ రావ్ నక్కిన డైరెక్షన్ లో చేయబోతున్న సినిమా మాత్రం చాలా డిఫెరెంట్ గా ఉంటుందట. ఇండస్ట్రీ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమా కథ పాయింట్….

కొంచం మెగాస్టార్ చిరంజీవి నటించిన క్లాసిక్ మూవీస్ లో ఒకటైన చంటబ్బాయి సినిమా కథ పాయింట్ ని పోలి ఉంటుందని అంటున్నారు. అంటే అల్లరి చిల్లర పనులు చేసే డిటెక్టివ్ లైఫ్ లో జరిగిన సంఘటనల నేపధ్యంలో సినిమా ఉంటుందని అంటున్నారు. చంటబ్బాయి సినిమా తర్వాత అలాంటి జానర్ లో…

చాలా తక్కువ సినిమాలే రాగా ఇప్పుడు అలాంటి నేపధ్యంతో ఆద్యందం అలరించే కథతో రవితేజ సినిమా ఉంటుందని అంటున్నారు. కామెడీ సినిమాలు చేయడం తో త్రినాధ రావ్ నక్కిన ఇప్పటికే తన స్పెషాలిటీ ని చూపెట్టగా ఇప్పుడు రవితేజ తో చేయబోతున్న ఈ సినిమా తో అన్నీ అనుకున్నట్లు జరిగితే మరో మెట్టు ఎక్కే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

కాగా ఈ సినిమా ఎప్పుడు మొదలు అవుతుంది అన్న విశేషాలు ఇంకా రిలీజ్ అవ్వాల్సి ఉండగా రమేష్ వర్మ సినిమా అలాగే ఈ సినిమా కూడా రెండూ సైమల్ టెనియస్ గా చేయాలి అని రవితేజ భావిస్తున్నట్లు సమాచారం. ఇక ఫ్యాన్స్ మాత్రం ముందుగా వస్తున్న క్రాక్ తో ఈ ఏడాది రవితేజ మళ్ళీ హిట్ భాట పట్టాలి అని కోరుకుంటున్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here