ప్రస్తుతం హిట్స్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న టాలీవుడ్ హీరోల్లో గోపీచంద్ మరియు రవితేజ ముందు నిలుస్తారు అని చెప్పాలి. మాస్ లో ఇద్దరికీ మంచి క్రేజ్ ఉండగా వరుస ఫ్లాఫ్స్ వలన రీసెంట్ టైం లో ఇబ్బందులు పడుతుండగా, గోపీచంద్ అయితే మరింత ఎక్కువ టైం నుండి ఫ్లాఫ్స్ తో సతమతం అవుతుండగా… రవితేజ కూడా లాస్ట్ 4 సినిమాలుగా ఒక్కటంటే ఒక్క హిట్ కూడా లేకుండానే కెరీర్ ని కొనసాగిస్తున్నాడు.
ఇలాంటి టైం లో రీసెంట్ గా వీళ్ళ అప్ కమింగ్ సినిమాల డైరెక్టర్ పై ఒక టాక్ ఎక్కువగా వినిపించింది, లాస్ట్ ఇయర్ ఎండ్ లో ప్రతీ రోజూ పండగే సినిమా తో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న మారుతి ఇప్పటి వరకు కొత్త సినిమా కమిట్ అవ్వలేదు.
దాంతో ముందు రవితేజ తో ఎలాగైనా సినిమా చేయాలని ప్లాన్ చేసినా రవితేజ లేటెస్ట్ కమిట్ మెంట్స్ వల్ల గ్యాప్ దొరకలేదు, గోపీచంద్ అప్ కమింగ్ మూవీస్ లో బెస్ట్ సెలెక్షన్ గా మారుతి డైరెక్షన్ లో మూవీ ఆల్ మోస్ట్ కన్ఫాం అని న్యూస్ వచ్చ్సినా ఎందుకనో…
సినిమా కన్ఫాం అవ్వలేదు… దాంతో మారుతి ఫైనల్ గా ఎవరితో చేస్తాడు అన్నది ఆసక్తిగా మారగా మళ్ళీ రవితేజ దగ్గరకు వెళ్లి డేట్స్ ఎలాగోలా అడ్జస్ట్ చేయాలనీ ట్రై చేశారు కానీ కుదరకపోవడం తో ఇక ఈ ఇద్దరు హీరోలను కాదని ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంట్రీ ఇచ్చిన 5 ఏళ్ళకి క్లీన్ హిట్ కొట్టిన…
యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తో మారుతి అప్ కమింగ్ ఆల్ మోస్ట్ కన్ఫాం అయ్యిందన్న టాక్ వస్తుంది, ప్రస్తుతం అల్లుడు అదుర్స్ ఫినిష్ చేసే పనిలో ఉన్న బెల్లంకొండ శ్రీనివాస్ తర్వాత కొత్త సినిమా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు, రమేష్ వర్మ తో, సుదీర్ వర్మ తో అనుకున్నా ఇంకా ఫైనల్ అవ్వలేదు… దాంతో మారుతి తో సేఫ్ గేమ్ చాలా బెటర్ ఆప్షన్ అని ఈ సినిమా ని కమిట్ అయ్యాడని అంటున్నారు.