మాస్ మహారాజ్ రవితేజ ఈ ఇయర్ లో క్రాక్ సినిమా తో బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపాడు. వరుసగా బాక్ టు బాక్ 4 ఫ్లాఫ్ మూవీస్ ని సొంతం చేసుకున్న తర్వాత అతి క్లిష్ట పరిస్థితులలో బరిలోకి దిగిన క్రాక్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రవితేజ కెరీర్ లో నంబర్ 1 మూవీ గా నిలిచి దుమ్ము లేపింది. ఈ సినిమా విజయం తర్వాత…
రెట్టించిన జోరు తో వరుస పెట్టి సినిమాలను కమిట్ అవుతున్న రవితేజ ఇప్పుడు చేస్తున్న కొత్త సినిమా ఖిలాడీ ఆల్ మోస్ట్ షూటింగ్ ను కంప్లీట్ చేసుకోబోతుంది. ఈ సినిమా సమ్మర్ కానుకగా ఆడియన్స్ ముందుకు రావాల్సింది కానీ సెకెండ్ వేవ్ వలన షూటింగ్ డిలే అయింది.
త్వరలోనే సినిమా కోసం మంచి డేట్ ను చూసి ఆడియన్స్ ముందుకు సినిమాను తీసుకు రావాలని ప్లాన్ చేస్తుండగా మరో పక్క ఈ సినిమా గురించిన విశేషాల గురించి మాట్లాడుతూ సినిమా డైరెక్టర్ రమేష్ వర్మ ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ అని చెప్పుకొచ్చాడు.
ఈ సినిమా కి ముందు అనుకున్న బడ్జెట్ కన్నా కూడా ఓవరాల్ బడ్జెట్ పెరిగి ఇప్పుడు 65 కోట్ల రేంజ్ బడ్జెట్ లో ఈ సినిమా నిర్మాణం అవుతుందని బాంబు పేల్చాడు డైరెక్టర్ రమేష్ వర్మ. మాములుగా రవితేజ సినిమాల బడ్జెట్ లు 30 నుండి 35 కొన్ని సార్లు మాత్రమె 40 కోట్ల దాకా వెళ్ళాయి అని చెప్పాలి. కానీ ఇప్పుడు ఖిలాడీ బడ్జెట్ ఏకంగా….
డైరెక్టర్ చెబుతున్నట్లు 65 కోట్ల రేంజ్ లో ఉంటే కనుక అంతలా సినిమాలో ఏం స్పెషాలిటీ ఉందో అన్నది ఆసక్తి కరం అని చెప్పాలి. క్వాలిటీ పరంగా హై స్టాండర్డ్ తో తెరకెక్కిన సినిమా అని, యాక్షన్ సీన్స్ అదిరిపోతాయి అంటూ చెబుతున్నారు. మరి సినిమా వచ్చాక ఆ బడ్జెట్ కి తగ్గ న్యాయం సినిమా ఎంతవరకు చేస్తుంది అనేది ఆసక్తి కరం అని చెప్పాలి.