Home న్యూస్ మాస్ట్రో ట్రైలర్ రివ్యూ…OTT రిలీజ్ ఎప్పుడంటే!

మాస్ట్రో ట్రైలర్ రివ్యూ…OTT రిలీజ్ ఎప్పుడంటే!

0

యూత్ స్టార్ నితిన్ నటించిన లేటెస్ట్ మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరచగా ఆశలన్నీ కూడా అప్ కమింగ్ మూవీ అయిన అంధధూన్ రీమేక్ మాస్ట్రో మీదే పెట్టుకోగా థియేటర్స్ లో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా ఇప్పుడు డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ను కన్ఫాం చేసుకుని ఆడియన్స్ ముందుకు రాబోతుండగా సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను రీసెంట్ గా లాంచ్ చేశారు… హిందీ లో సూపర్ హిట్ అయిన అంధధూన్ సినిమా…

ఎక్స్ పెరిమెంటల్ మూవీ అయినా బాగా ఆకట్టుకుంది. ఇక తెలుగులో కొన్ని మార్పులు చేశాం అంటూ చెప్పారు కానీ ట్రైలర్ చూస్తె మట్టుకు సీన్ బై సీన్ దింపేశారు అనిపిస్తుంది. పియానో ప్లేయర్ అయిన హీరో ఒక అంధుడు, తన పియానో ప్లే నచ్చి హీరోయిన్ జాబ్ ఇస్తుంది…

మరో పక్క ఓ బిగ్ షాట్ అయిన తమన్నా ఇంట్లో పియానో ప్లే చేయడానికి వెళ్ళే హీరో అక్కడ ఊహించని పరిస్థితులను ఎదురుకుంటాడు.. ఆ ఇంసిడెంట్ తన లైఫ్ ని టర్న్ అయ్యేలా చేస్తుంది, మరి ఇలాంటి పరిస్థితుల నుండి హీరో సేఫ్ అయ్యాడా లేదా అలాగే…

హీరో నిజంగానే అంధుడా కాదా అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే… ఒరిజినల్ ట్రైలర్ కట్ ని అలానే దింపేసినా కానీ ఆకట్టుకునే ఎలిమెంట్స్ ట్రైలర్ లో ఉండటం సినిమా పై అంచనాలను పెంచింది. డార్క్ కామెడీ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమా సస్పెన్స్ ని చివరిదాకా అద్బుతంగా మెయిన్ టైన్ చేసి క్లైమాక్స్ లో మంచి థ్రిల్ ఇచ్చేలా ముగుస్తుంది…

తెలుగు లో కూడా ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉన్న ఈ సినిమా ఇప్పుడు డైరెక్ట్ గా డిజిటల్ లో సెప్టెంబర్ 9 న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ కాబోతుంది. ఇక ట్రైలర్ 24 గంటల్లో ఎలాంటి రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకుంటుందో చూడాలి. మొత్తం మీద నితిన్ కంబ్యాక్ మూవీ అవ్వాల్సింది, OTT లో రిలీజ్ కాబోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here