బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ రవితేజ రాజా ది గ్రేట్ తో 2017 లో మంచి కంబ్యాక్ ఇవ్వగా తర్వాత వరుస పెట్టి సినిమాలను ఒప్పుకున్నారు రవితేజ, కానీ ఒప్పుకున్న సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకటికి మించి ఒకటి నిరాశ పరుస్తూ వచ్చాయి. దాంతో ఒక్కో సినిమా రిలీజ్ అవ్వడం అవి బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్స్ కి మించి డిసాస్టర్లు గా నిలవడం జరుగుతూ వచ్చింది.
కానీ నాలుగు బాక్ టు బాక్ డిసాస్టర్ల తర్వాత కూడా రవితేజ లేటెస్ట్ మూవీ క్రాక్ పై అంచనాలు సాలిడ్ గా ఉండగా ఆ అంచనాలను అందుకున్న సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఇప్పుడు లాంగ్ రన్ లో కూడా సత్తా చాటుకుంటూ…
అల్టిమేట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది. ఈ క్రమం లో రీసెంట్ గా సినిమా 35 కోట్లకు పైగా షేర్ ని సొంతం చేసుకోగా సినిమా బిజినెస్ ను దాటేసి మొత్తం మీద ఇప్పటి వరకు 18 కోట్లకు పైగా లాభాన్ని దక్కించుకుని సంచలన బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
మాస్ మహారాజ్ రవితేజ కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ తో పాటు ఇప్పుడు హైయెస్ట్ లాభాలను కూడా సొంతం చేసుకున్న సినిమా గా నిలిచి సంచలనం సృష్టించింది ఈ సినిమా… రవితేజ సినిమాలు అంటే మినిమమ్ 20 నుండి 23 కోట్ల రేంజ్ లో బిజినెస్ లు జరిగేవి, అందులో కొన్ని 5 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ కి మించి సాధించినా కానీ ఏ సినిమా అత్యంత భారీ లాభాలను అయితే సొంతం చేసుకోలేదు..
కానీ పోస్ట్ కోవిడ్ తర్వాత రిలీజ్ అయిన క్రాక్ సినిమా థియేట్రికల్ బిజినెస్ తక్కువ కాబట్టి సినిమా సాధించిన విజయం వలన ప్రాఫిట్ లెక్క 18 కోట్ల మార్క్ ని అందుకుని దూసుకు పోతూ ఉండగా టోటల్ రన్ లో 19 కోట్లకు పైగానే ప్రాఫిట్ తో పరుగు ముగించే అవకాశం ఎంతైనా ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాంతో బిగ్గెస్ట్ హిట్ తో పాటు హైయెస్ట్ ప్రాఫిటబుల్ మూవీ గా కూడా ఈ సినిమా నిలిచింది.
Film industry Back bone for raviteja sir. no background no support.hats of to u raviteja sir