Home గాసిప్స్ మాస్ మహారాజ్ రాంపేజ్…రెమ్యునరేషన్ అమాంతం పెంచేశాడట!!

మాస్ మహారాజ్ రాంపేజ్…రెమ్యునరేషన్ అమాంతం పెంచేశాడట!!

0

మాస్ మహారాజ్ రవితేజ వరుస పెట్టి ఫ్లాఫ్స్ ను ఎదురుకున్న తర్వాత ఎట్టకేలకు ఈ ఏడాది క్రాక్ సినిమా తో బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ విజయాన్ని సొంతం చేసుకుని సత్తా చాటి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ కంబ్యాక్ ని సొంతం చేసుకుని సత్తా చాటుకున్నాడు. ఆ సినిమా విజయంతో మళ్ళీ జోరు పెంచిన రవితేజ ఇప్పుడు వరుస పెట్టి సినిమాలను చేస్తూ దూసుకు పోతున్న మాస్ మహారాజ్…

ఇప్పుడు ఖిలాడీ సినిమాతో ముందుగా ఆడియన్స్ ముందుకు రాబోతుండగా… తర్వాత శరత్ మండవ తో చేస్తున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోంది. ఇందులో రవితేజ ఎమ్మార్యో గా నటించబోతున్నాడు. తర్వాత  త్రినాథరావు నక్కిన కాంబినేషన్ లో ‘ధమాకా’ సినిమా  తెరకెక్కుతుండగా….

Krack 19 Days Total Worldwide Collections

ఇందులో మాస్ రాజా లాయర్ గా కనిపిస్తారని టాక్. ‘దొంగాట’ ఫేమ్ వంశీ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటిస్తున్న సినిమా ‘టైగర్ నాగేశ్వరరావు’. ఇది స్టువర్ట్ పురంలో పేరుమోసిన గజదొంగ నాగేశ్వరరావు బయోపిక్. రవితేజ కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. ఇక సుధీర్ వర్మ డైరెక్షన్ లో చేస్తున్న ‘రావణాసుర’ స్టైలిష్ యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది.

Krack 3 weeks(21 Days) Total Worldwide Collections

ఇలా వరుస పెట్టి సినిమాలను చేస్తున్న రవితేజ ఇప్పుడు చేస్తున్న కొత్త సినిమాలకు రెమ్యునరేషన్ కూడా అమాంతం పెంచేశాడని టాక్ వినిపిస్తుంది, క్రాక్ కి ముందు కూడా ఫ్లాఫ్స్ లో ఉన్నప్పటికీ 6-8 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే రవితేజ తర్వాత ఖిలాడీ, ధమాకా, రామారావు ఆన్ డ్యూటీ లాంటి సినిమాలకు 12-14 కోట్ల రేంజ్ రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారని టాక్ ఉండగా తర్వాత చేస్తున్న…

‘టైగర్ నాగేశ్వరరావు’ కి ఏకంగా 18 కోట్ల రేంజ్ రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారని వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. రవితేజ సినిమాలకు హిట్స్ కి ఫ్లాఫ్స్ కి అతీతంగా నాన్ థియేట్రికల్ బిజినెస్ ఎప్పుడూ కూడా అల్టిమేట్ గా జరగడం వలెనే ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ సొంతం అవుతుందని చెప్పొచ్చు. ఇప్పుడు హిట్టు కొట్టిన జోరులో ఉన్న రవితేజ అప్ కమింగ్ సినిమాలతో అంచనాలను అందుకుంటే తన రేంజ్ ని మరో లెవల్ కి పెంచుకునే అవకాశం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here