ఒకరితో సినిమా అనుకుని మరొకరితో ఆ సినిమాలు తీయడం అన్నది సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది, కథలు నచ్చకనో లేదా ఇంకా ఏమైనా కారణాల వలనో కానీ ఫస్ట్ అనుకున్న వాళ్ళు సినిమా చేయక పోవడం తో వేరే వాళ్ళు ఆ కథలు చేసిన సందర్బాలు ఇండస్ట్రీ లో అనేకం ఉన్నాయి. రీసెంట్ గా మన ఇండస్ట్రీ లోనే కాకుండా కోలివుడ్ ఇండస్ట్రీ లో మంచి రోల్ అవకాశం మన హీరో కి వస్తే నో చెప్పారని తెలిసింది….
వివరాల్లోకి వెళితే కోలివుడ్ లో రియలస్టిక్ కథ తో ధనుష్ హీరోగా రూపొందిన వాడా చెన్నై సినిమా ఓ రేంజ్ లో విజయాన్ని నమోదు చేసింది, ధనుష్ వెట్రిమారన్ ల కాంబినేషన్ లో అద్బుతాలు సృష్టించిన ఈ సినిమా సీక్వెల్ అతి త్వరలోనే మొదలు అవుతుందని…
అంటూ ఉండగా ఈ సినిమా గురించి డైరెక్టర్ వెట్రిమారన్ రీసెంట్ గా సోషల్ మీడియా లో ప్రస్తావిస్తూ సినిమాలో సెకెండ్ మెయిన్ హైలెట్ అయిన ఒక డాన్ రోల్ కి ముందుగా మాస్ మహారాజ్ రవితేజ ని అడిగామని చెప్పుకొచ్చారు. సినిమాలో కీలకమైన ఆ డాన్ రోల్ అద్బుతంగా స్టార్ట్ అయ్యి…
కొద్ది సేపటి తర్వాత తన అనుచరుల చేత హత్య కాబడుతుంది, చిన్న రోలే అయినా చాలా పవర్ ఫుల్ రోల్ కాబట్టి ముందు రవితేజ ని తర్వాత విజయ్ సేతుపతి తో ఈ రోల్ చేయించాలని చాలా ట్రై చేశారట డైరెక్టర్, రవితేజ కి కథ బాగా నచ్చినా అప్పుడు తన లుక్ ని మార్చుకుని రాజా ది గ్రేట్ తో పాటు 3 కొత్త సినిమాలు…
కమిట్ అవ్వడం తో డేట్స్ అడ్జస్ట్ చేయలేమని, మళ్ళీ గడ్డం పెంచితే ఇతర సినిమాలకు ఇబ్బంది అని నో చెప్పాల్సి వచ్చిందట, అదే టైం లో విజయ్ సేతుపతి కూడా లెక్కకు మిక్కిలి రోల్స్ వలన ఈ సినిమా వదులుకోవాల్సి రావడం తో రాజన్ అనే నటుడితో ఆ రోల్ చేయించగా సినిమాలో అద్బుతంగా నటించాడు ఆ నటుడు… రవితేజ చేసి ఉంటే సినిమా తెలుగు లో కూడా కచ్చితంగా వచ్చి ఉండేదేమో…