మాస్ మహారాజ్ రవితేజ నటించిన రీసెంట్ మూవీస్ లో రాజా ది గ్రేట్ తప్పితే మిగిలిన సినిమాలు అంచనాలను అందుకోవడం లో విఫలం అయిన విషయం తెలిసిందే. రాజా ది గ్రేట్ తర్వాత చేసిన టచ్ చేసి చూడు, నేల టికెట్ మరియు అమర్ అక్బర్ ఆంథోని సినిమాలు ఫ్లాఫ్ లు మిగిలి పోగా ఈ సినిమాల్లో టచ్ చేసి చూడు మాత్రం స్పెషల్ మూవీ అనే చెప్పాలి. ఆ సినిమా కి శాటిలైట్ రైట్స్ కింద…
హిందీ డబ్బింగ్ స్ట్రీమింగ్ అండ్ శాటిలైట్ రైట్స్ అన్నీ కలిపి 20 కోట్లకు పైగానే వచ్చాయి. అందులో టెలివిజన్ రైట్స్ కి సుమారు 8 కోట్ల దాకా దక్కినట్లు సమాచారం. కానీ సినిమా ఫ్లాఫ్ అవ్వడం తో అప్పటి కప్పుడు టెలికాస్ట్ చేయలేదు, ఏకంగా 1 ఇయర్ గ్యాప్ తీసుకుని…
రీసెంట్ గా టెలికాస్ట్ చేశారు. కాగా సినిమా కి మొదటి సారి టెలికాస్ట్ సమయం లో మంచి TRP రేటింగ్ దక్కింది అని చెప్పొచ్చు. పోటి పెద్దగా లేక పోవడం తో ఈ సినిమా కి ఏకంగా 8.4 TRP రేటింగ్ దక్కింది. సినిమా ను స్టార్ మా 8 కోట్లు పెట్టి కొనగా మొదటి సారే సినిమా ద్వారా…
చాలా మొత్తం రికవరీ అయ్యిందని సమాచారం. దాంతో సినిమా వల్ల భారీగా నష్ట పోతాం అనుకున్న ఛానెల్ వారికి ఇప్పుడు సినిమా ద్వారా లాభాలు సొంతం అయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు. మొదటి సారే చాలా మొత్తం రావడం తో ఇప్పుడు మరోసారి సినిమాను..
టెలికాస్ట్ చేయాలనీ దాంతో మరింత రికవరీ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తం మీద వెండి తెరపై నిరాశ పరిచిన టచ్ చేసి చూడు బుల్లి తెరపై మాత్రం ఛానెల్ కి లాభాలు దక్కేలా చేయబోతుండటం విశేషం అనే చెప్పాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.