బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి రేసు యమ జోరుగా సాగుతుంది, రేసులో ఉన్న సినిమాలు అన్నీ కూడా మంచి వసూళ్ళని సాధిస్తూ దూసుకు పోతున్నాయి. జనవరి 14 న అన్ని సినిమాలు సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా 15 న సినిమాలు ఎలా పెర్ఫార్మ్ చేశాయి అన్నది ఆసక్తిగా మారగా మరో హాలిడే అవ్వడం తో కలెక్షన్స్ జోరు సాలిడ్ గా ఉందని చెప్పాలి. ఒకసారి ఒక్కో సినిమా బాక్స్ ఆఫీస్ స్టేటస్ ను గమనిస్తే…
ముందుగా రామ్ రెడ్ మూవీ రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ గా హోల్డ్ చేసి స్ట్రాంగ్ కలెక్షన్స్ తో దూసుకు పోతుంది, మొదటి రోజు తో పోల్చితే రెండో రోజు డ్రాప్స్ కేవలం తక్కువ గానే ఉండగా రెండో రోజు ఇప్పుడు సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మరో 2.8-3 కోట్ల రేంజ్ షేర్ కి సిద్ధం అవుతుంది.
ఇక మరో కొత్త సినిమా అల్లుడు అదుర్స్ మొదటి రోజు కలెక్షన్స్ సాలిడ్ గా ఉండగా రెండో రోజు కూడా ఆంధ్రా రీజన్ లో బాగానే హోల్డ్ చేసిన సినిమా నైజాం లో స్లో అయింది. మొత్తం మీద రెండో రోజు మరో కోటి రేంజ్ షేర్ కన్ఫాం అవ్వగా మొత్తం మీద 1.3 కోట్ల రేంజ్ షేర్ ని అందుకునే ఛాన్స్ ఉంది.
ఇక సంక్రాంతి మొదటి క్లీన్ హిట్ క్రాక్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6 వ రోజు కూడా స్ట్రాంగ్ కలెక్షన్స్ ని సాధిస్తూ దూసుకు పోతుంది, థియేటర్స్ కొంచం తగ్గించినా ఉన్న థియేటర్స్ లోనే మంచి ఆక్యుపెన్సీ తో రన్ అవుతున్న సినిమా మరో స్ట్రాంగ్ డే ని సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. మొత్తం మీద ఈ రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 2 కోట్ల నుండి 2.2 కోట్ల రేంజ్ కలెక్షన్స్ ని అందుకోవచ్చు.
ఇక మాస్టర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి హోల్డ్ నే సొంతం చేసుకుంది… సినిమా బ్రేక్ ఈవెన్ కి చేరువ అవ్వగా ఈ రోజు సాధించే కలెక్షన్స్ తో హిట్ అవుతుంది, మూడో రోజు 1 కోటి నుండి 1.2 కోట్ల రేంజ్ షేర్ ని అందుకోవచ్చు. అన్ని సినిమాలు ఈ అంచనాలను మించి కలెక్షన్స్ సాధించాలని కోరుకుందాం…