Home న్యూస్ అపరిచితుడు రీ రిలీజ్ కలెక్షన్స్…ఈ టైంలో ఇది మాస్ రచ్చే!

అపరిచితుడు రీ రిలీజ్ కలెక్షన్స్…ఈ టైంలో ఇది మాస్ రచ్చే!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర పేరుకు సమ్మర్ అయినా కూడా అసలు సినిమాలే లేని పరిస్థితి నెలకొంది…రిలీజ్ అవుతున్న చిన్నా చితకా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు రీ రిలీజ్ లు కూడా పెద్దగా హోల్డ్ ని చూపించలేక పోతున్నాయి. కాగా ఇలాంటి టైంలో 18 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన….

సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ అపరిచితుడు(Aparichitudu Re Release Collections) మూవీ తెలుగులో ఊహకందని బ్లాక్ బస్టర్ గా నిలవగా ఆల్ మోస్ట్ 18 ఏళ్ల తర్వాత ఈ సినిమాను రీసెంట్ గా తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ చేశారు. మొదటి రోజు లిమిటెడ్ రిలీజ్ లో ఓవరాల్ గా మంచి కలెక్షన్స్ ని సినిమా సొంతం చేసుకుంది…

మొదటి రోజు ట్రాక్ చేసిన సెంటర్స్ లో ఆల్ మోస్ట్ 16 లక్షలకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా బాక్స్ అఫీస్ దగ్గర వీకెండ్ అయిన తర్వాత కూడా లిమిటెడ్ షోలతో ఎంతో కొంత ఫుట్ ఫాల్స్ ను సొంతం చేసుకుంటూ ఉండగా ఓవరాల్ గా సినిమా ఇప్పటి వరకు 28 లక్షల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అటూ ఇటూగా అందుకుందని సమాచారం.

మొత్తం మీద ఈ టైంలో అసలు జనాలే థియేటర్స్ కి రాని ఈ పరిస్థితిలో ఇవి మంచి కలెక్షన్స్ అనే చెప్పాలి, అది కూడా ఒక డబ్బింగ్ మూవీ కి ఇలాంటి కలెక్షన్స్ ఇప్పుడు సొంతం అవ్వడం విశేషమే. టోటల్ రన్ లో సినిమా 30 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here