Home న్యూస్ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ రివ్యూ….హిట్టా-ఫట్టా!!

రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ రివ్యూ….హిట్టా-ఫట్టా!!

0

లవ్ టుడే సినిమాతో మంచి యూత్ హిట్ ను సొంతం చేసుకుని కుమ్మేసిన ప్రదీప్ రంగనాథన్‌ నటించిన లేటెస్ట్ మూవీ డ్రాగన్ తెలుగు లో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ పేరుతో డబ్ అయ్యి రిలీజ్ అవ్వగా సినిమా ట్రైలర్ బాగానే క్లిక్ అవ్వగా లవ్ టుడే హీరో సినిమా అలాగే ఓ మై దేవుడా సినిమా డైరెక్టర్ తర్వాత సినిమా అవ్వడంతో ఈ సినిమా మీద మంచి అంచనాలే ఏర్పడ్డాయి. మరి సినిమా ఎలా ఉంది ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం పదండీ…

ముందుగా కథ పాయింట్ కి వస్తే…కాలేజ్ టైంలో చదవకుండా లైఫ్ ఎంజాయ్ చేసి ఏకంగా 48 సబ్జెక్ట్ లలో ఫెయిల్ అయిన హీరో తర్వాత 6 ఏళ్ళు ఖాళీగా ఉంటాడు, ఈ టైం లో తన ఫస్ట్ లవ్ అనుపమ తనని వదిలేస్తుంది. తర్వాత ఫేక్ సర్టిఫికేట్స్ తో ఓ జాబ్ అండ్ పెళ్లి సెట్ అవుతుంది. ఈ క్రమంలో అనుకోకుండా జరిగిన ఓ ట్విస్ట్ తో హీరో లైఫ్ టర్న్ అవుతుంది….ఆ ట్విస్ట్ ఏంటి ఆ తర్వాత కథ ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…

డీసెంట్ స్టోరీ పాయింట్ తో వచ్చిన ఎంటర్ ది డ్రాగన్ సినిమా ఫస్టాఫ్ కొంచం పడుతూ లేస్తూ సాగుతుంది, లవ్ స్టోరీ, హీరో క్యారెక్టర్ మొదట్లో కొంచం డిఫెరెంట్ గా అనిపించినా సినిమా గడుస్తున్న కొద్ది బాగానే మెప్పిస్తూ ఇంటర్వెల్ టైంకి సెకెండ్ ఆఫ్ పై అంచనాలు భారీగా పెంచుతుంది…

ఆసక్తి కరమైన పాయింట్ తర్వాత సెకెండ్ ఆఫ్ కథ అటు కన్ఫ్యూజన్ ని ఇటు కామెడీని సమపాళ్ళలో పండిస్తూ సాగి చివరి అరగంట ఎమోషనల్ పాయింట్ తో కూడా మెప్పించి ఓవరాల్ గా సినిమా ఎండ్ అయ్యే టైంకి ఓ మంచి సినిమా చూసిన ఫీలింగ్ తోనే ఆడియన్స్ బయటికి వచ్చేలా చేస్తుంది…

ప్రదీప్ రంగనాథన్‌ ఫుల్ ఎనర్జీతో తన రోల్ తో చెడుగుడు ఆడేసుకున్నాడు, తన యాక్టింగ్ డైలాగ్స్ అన్నీ బాగా మెప్పించాయి…హీరోయిన్స్ ఇద్దరూ మెప్పించాగా మిగిలిన యాక్టర్స్ అందరూ ఆకట్టుకున్నారు. తెలుగు డబ్బింగ్ ఎక్స్ లెంట్ గా సెట్ అవ్వగా పాటలు కూడా తెలుగు లో బాగా సెట్ అయ్యాయి…

ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ లో కొంచం స్లో అయినట్లు అనిపించినా కూడా ఒక్క సారి కథ టేక్ ఆఫ్ అయ్యాక ఆ ఫ్లో అలా మెయిన్ టైన్ అవుతూ బాగా మెప్పించింది… ముఖ్యంగా సెకెండ్ ఆఫ్ సినిమాను ఓ రేంజ్ లో నిలబెట్టి సినిమా అయ్యే టైంకి ఓ మంచి సినిమా చూసిన ఫీలింగ్ ఆడియన్స్ కి కలిగించింది…

డైరెక్టర్ చెప్పిన పాయింట్ అందరికీ ఈజీగా కనెక్ట్ అయ్యేలా ఉండటంతో కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా సినిమా చాలా వరకు ఆడియన్స్ అంచనాలను అందుకుంటుంది అని చెప్పాలి…ఈ వీకెండ్ బెస్ట్ ఆప్షన్స్ లో ఈ సినిమా కూడా ఒకటి అని చెప్పొచ్చు. ఓవరాల్ గా సినిమా కి మా రేటింగ్ 2.75 స్టార్స్….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here