Home న్యూస్ 100 స్క్రీన్స్ లో రిలీజ్…కరోనా వైరస్ 4 రోజుల కలెక్షన్స్…దారుణం ఇది!

100 స్క్రీన్స్ లో రిలీజ్…కరోనా వైరస్ 4 రోజుల కలెక్షన్స్…దారుణం ఇది!

0

8 నెలలుగా మూసేసి ఉన్న థియేటర్స్ లో జనాలను తిరిగి థియేటర్స్ వైపు రప్పించే సత్తా ఉన్న సినిమాల కోసం ఎదురు చూస్తున్న టైం లో ఎప్పుడో డైరెక్ట్ రిలీజ్ అవ్వాల్సిన రామ్ గోపాల్ వర్మ నిర్మాణం లో తెరకెక్కిన కరోనా వైరస్ సినిమా థియేటర్స్ లో ఇప్పుడు రిలీజ్ అయిన ఫస్ట్ మూవీ గా రికార్డ్ సొంతం చేసుకోవడం కోసం రెండు తెలుగు రాష్ట్రాలలో సుమారు 100 కి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకుంది.

సినిమా కూడా పర్వాలేదు అనిపించే విధంగా ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం అందరూ లైట్ తీసుకుని ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్న టైం లో మళ్ళీ కరోనా ని గుర్తు చేసే ప్రయత్నం చేసినా ఈ సినిమాను ఎవ్వరూ అసలు పెట్టించుకొనే లేదు. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ ఇంపాక్ట్…

సాలిడ్ గా కనిపించింది. ఫలితం మొదటి రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 1.5 లక్షల వరకు షేర్ ని అందుకుంది. ఇక వీకెండ్ లో ఏమాత్రం ఇంపాక్ట్ ని క్రియేట్ చేయని ఈ సినిమా మొత్తం మీద 3 రోజుల వీకెండ్ లో 3 లక్షల వరకు షేర్ ని వసూల్ చేయగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు మొత్తం మీద….

4 రోజులు పూర్తీ అయ్యే టైం కి 3.5 లక్షల షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 100 థియేటర్స్ లో రిలీజ్ అయ్యి సుమారు 3.5 లక్షల షేర్ ని 4 రోజుల్లో సొంతం చేసుకుని కరోనా వైరస్ సినిమా భారీ షాక్ నే ఇవ్వగా… జనాలు థియేటర్స్ కి తిరిగి రప్పించాలి అంటే ఈ చిన్న చితకా సినిమాలు ఏమాత్రం సరిపోవు అని మరోసారి…

క్లియర్ అయ్యింది అని చెప్పొచ్చు. కొత్త సినిమాలు మినిమమ్ బజ్ ఉన్న సినిమాలు వస్తేనే బాక్స్ ఆఫీస్ దగ్గర తిరిగి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, ఈ సినిమా మట్టుకు బాక్స్ ఆఫీస్ దగ్గర దారుణమైన రిజల్ట్ ను సొంతం చేసుకుని పరుగును మరో రెండు మూడు రోజుల్లో ముగించుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here