రామ్ గోపాల్ వర్మ లాక్ డౌన్ టైం లో రూపొందించిన సినిమాల్లో కొంచం బెటర్ మూవీగా అనిపించిన సినిమా కరోనా…కరోనా పై అందరిలో ఉన్న భయాన్ని సినిమాగా రూపొందించిన వర్మ ఈ సినిమా ను డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ చేస్తాడు అని అంతా భావించినా మిగిలిన చెత్త సినిమాలను అన్నీ రిలీజ్ చేసినా కానీ ఈ సినిమా విషయం లో మాత్రం థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలనీ డిసైడ్ అయ్యాడు…
థియేటర్స్ డిసెంబర్ లో రీ ఓపెన్ అయిన తర్వాత తెలుగు లో థియేటర్స్ లో రిలీజ్ అయిన మొదటి సినిమాగా నిలిచిన ఈ సినిమా పర్వాలేదు అనిపించే టాక్ ని సొంతం చేసుకున్న కానీ రామ్ గోపాల్ వర్మ సినిమా అన్న కారణంగా పెద్దగా జనాలు థియేటర్స్ కి రాలేదు.
మొత్తం మీద 100 థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి 4 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర 3.5 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 6 లక్షల దాకా షేర్ ని సాధించింది అని సమాచారం…
కానీ సినిమా టోటల్ బడ్జెట్ 40 లక్షల దాకా అయ్యింది అని సమాచారం. థియేటర్స్ లో పెర్సేంటేజ్ బేస్ మీదే రిలీజ్ అయిన ఈ సినిమా బడ్జెట్ పరంగా చూసుకుంటే 2 శాతం బడ్జెట్ ని కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రికవరీ చేయలేక పోయింది. డైరెక్ట్ రిలీజ్ కి కరోనా పీక్ టైం లో ఉన్న సమయం లో మంచి మంచి ఆఫర్లు వచ్చినా నో చెప్పిన వర్మ కి ఇప్పుడు బాక్స్ ఆఫీస్ రిజల్ట్ షాక్ ఇచ్చింది అనే చెప్పాలి.
ప్రతీ అంశాన్ని బిజినెస్ చేసుకునే రామ్ గోపాల్ వర్మ సరైన టైం లో సినిమాను రిలీజ్ చేయలేదు. కరోనా అంటే కంప్లీట్ భయం పోయాక థియేటర్స్ లో వదిలినా పెద్దగా ఎవ్వరూ పట్టించుకోలేదు. సినిమా డిజిటల్ రిలీజ్ కూడా అవ్వడం తో ఇక థియేటర్స్ నుండి కంప్లీట్ గా బయటికి వచ్చేసింది ఈ సినిమా…