తెలుగు లో హెవీ పోటి నడుమ ఆడియన్స్ ముందుకు వచ్చి అతి తక్కువ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుని పరుగును కష్ట తరం చేసుకున్న సినిమా రాబర్ట్… కన్నడ స్టార్ హీరో దర్శన్ నటించిన ఈ సినిమా కర్ణాటకలో రికార్డ్ బ్రేకింగ్ లెవల్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా, తెలుగు లో తీవ్ర పోటి లో చేతులు ఎత్తేసింది, హీరో గురించి మన వాళ్లకి పెద్దగా తెలియక పోవడం, పోటి లో జాతిరత్నాలు…
అల్టిమేట్ లెవల్ లో దుమ్ము లేపడం అలాగే శ్రీకారం కూడా జోరు అందుకోవడం తో ఈ సినిమానే కాదు మరో తెలుగు మూవీ గాలి సంపత్ ను కూడా పట్టించుకున్న వాళ్ళు లేరు, కానీ తెలుగు లో ఈ సినిమా థియేటర్స్ నుండి ఇప్పుడు వస్తున్న కలెక్షన్స్ ని చూసి…
మూవీ టీం తెలుగు లో సినిమాను కొన్న వాళ్ళని ఎం ప్రమోట్ చేశారు, ఇలాంటి కలెక్షన్స్ ఏంటి… అసలు థియేటర్స్ ఏవి అంటూ అడుగుతున్నారని, అలాగే టాలీవుడ్ వాళ్ళు కావాలని ఈ సినిమా కి థియేటర్స్ ఇవ్వలేదని కామెంట్స్ చేస్తున్నారని టాక్ ఇప్పుడు టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తుంది.
ఇది ఎంతవరకు నిజం అన్నది తెలియాల్సి ఉండగా దీనికి మొదటి తప్పు టీం దే అని చెప్పాలి. ముందు తెలుగు డబ్ రిలీజ్ ను అనౌన్స్ చేసినప్పుడే ఆ టైం లో పోటి ఎక్కువగా ఉందని, కుదిరితే ఒక వారం లేదా కొన్ని రోజుల ముందుగానే అయినా ఇక్కడ రిలీజ్ చేసుకోండి అని చెప్పినా… మేం అనుకున్న డేట్ కే వస్తాం అంటూ తెగేసి చెప్పారట టీం వాళ్ళు ఇక్కడ వాళ్లకి…
దాంతో చేసేదేమీ లేక ఉన్నంతలో అన్ని సినిమాలకు కేటాయింపులు అయ్యాక ఉన్నంతలో 180 థియేటర్స్ ని కేటాయించారు ఇక్కడ వాళ్ళు. కానీ ఆ థియేటర్స్ లోనే సినిమా 5% కూడా ఆక్యుపెన్సీ ని సొంతం చేసుకోలేక తొలిరోజు 10 లక్షల లోపు రెండో రోజు 5 లక్షల రేంజ్ కలెక్షన్స్ ని సాధించింది. కానీ ఇప్పుడు ఇక్కడ సరిగ్గా ప్రమోట్ చేయలేదని తెలుగు రైట్స్ తీసుకున్న వాళ్ళని అనడం ఏమాత్రం సమంజసం కాదనే చెప్పాలి. పోటి లో వద్దూ అన్న వినకుండా వచ్చి ఇప్పుడు ఇలాంటి రిజల్ట్ కి కారణం అయ్యారు. సోలోగా వచ్చి ఉన్నా సినిమా బెటర్ గా పెర్ఫార్మ్ చేసి ఉండేది…