దిల్ రాజు తమ్ముడి కొడుకు ఆశిష్ ను హీరోగా లాంచ్ చేస్తూ తీసిన లేటెస్ట్ మూవీ రౌడీ బాయ్స్ ఆడియన్స్ ముందుకు సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యింది. టాలీవుడ్ బిగ్ స్టార్స్ అందరితో ప్రమోట్ చేయించిన ఈ సినిమా ఆ ప్రమోషన్స్ కి తగ్గట్లు ఆడియన్స్ ను మెప్పించిందా లేదా అంటే మట్టుకు లేదనే చెప్పాలి. ఒకసారి సినిమా స్టొరీ పాయింట్ కి వెళితే…. ఇంజనీరింగ్ చదివే హీరో కాలేజ్ కి….
మెడికల్ కాలేజ్ కి తరచూ గొడవలు జరుగుతూ ఉంటాయి, ఆ మెడికల్ కాలేజ్ లో హీరోయిన్ అనుపమ మెడిసిన్ చదువుతూ ఉండగా తనని చూసి ఇటు హీరో అటు మెడికల్ కాలేజ్ లో ఉండే విక్రమ్ లు ఇష్టపడతారు… కానీ హీరోయిన్ ఎవరిని ఇష్టపడింది… హీరో హీరోయిన్ ని ఇంప్రెస్ చేయడానికి ఏం చేశాడు లాంటి విశేషాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…
అతి సాధారణమైన స్టొరీ పాయింట్ తో వచ్చిన రౌడీ బాయ్స్ కేవలం పార్టు పార్టులుగానే ఆకట్టుకుంది, ఉన్నంతలో ఫస్ట్ సినిమానే అయినా ఎలాంటి బెరుకు లేకుండా ఆశిష్ పర్వాలేదు అనిపించగా డాన్సులు మంచి ఈజ్ తో చేశాడు, ఇక అనుపమ తన రోల్ కి ఫుల్ న్యాయం చేయగా క్లైమాక్స్ లో బాగా యాక్ట్ చేసింది…
ఇక విక్రమ్ తన రోల్ లో జస్ట్ ఓకే అనిపించుకోగా మిగిలిన యాక్టర్స్ పర్వాలేదు అనిపించుకున్నారు, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం పర్వాలేదు అనిపించగా బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. ఎడిటింగ్ చాలా వీక్ గా ఉండగా స్క్రీన్ ప్లే కూడా నీరసం తెప్పిస్తుంది… సినిమాటోగ్రఫీ బాగుండగా, ప్రొడక్షన్ వాల్యూస్ మెప్పిస్తాయి…
ఇక డైరెక్షన్ విషయానికి వస్తే హర్ష కొనుగంటి రాసుకున్న కథనే చాలా వీక్ గా ఉండగా సినిమా తెరకెక్కిన విధానం కూడా అంతే నీరసంగా ఉంది, అక్కడక్కడా కొన్ని సీన్స్ మినహా సినిమా ఏ దశలో కూడా మెప్పించలేకపోయింది. కానీ హీరోగా తొలి సినిమాతో ఆశిష్ మంచి మార్కులు సొంతం చేసుకున్నాడు అని చెప్పాలి. కొంచం ఓపికతో కష్టపడి చూస్తె సినిమా పర్వాలేదు అనిపిస్తుంది… సినిమా కి మా ఫైనల్ రేటింగ్ 2.25 స్టార్స్…