బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో పరుగును పూర్తీ చేసుకున్న మమ్మోత్ బ్లాక్ బస్టర్ మూవీ ఆర్ ఆర్ ఆర్ ఆర్ మూవీ ఇప్పుడు ఒక పక్క డిజిటల్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతుంది. మరో పక్క సినిమా ఇప్పుడు అమెరికాలో అన్ కట్ వర్షన్ అంటూ మళ్ళీ రీసెంట్ గా రీ రిలీజ్ చేశారు…. అక్కడ నుండి ఎక్స్ లెంట్ రెస్పాన్స్ తో….
దూసుకు పోతున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ అక్కడ ఫస్ట్ డే కి వచ్చే సరికి ఏకంగా 57 వేల డాలర్స్ ని వసూల్ చేసింది. రెండో రోజు 10 వేల రేంజ్ లో డాలర్స్ ని వసూల్ చేసింది. మొత్తం మీద 2 రోజుల్లో 67 వేల డాలర్స్ ని సొంతం చేసుకుంది.
అంటే ఇండియన్ కరెన్సీలో ఆల్ మోస్ట్ 52 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా. 50 రోజుల తర్వాత మళ్ళీ రీ రిలీజ్ అయినా కానీ ఇలాంటి కలెక్షన్స్ ని అక్కడ సొంతం చేసుకోవడం అన్నది మామూలు విషయం కాదనే చెప్పాలి ఇప్పుడు. ఇక ఈ వీకెండ్ లో సినిమా అక్కడ జోరు చూపించే అవకాశం ఉందని చెప్పాలి.