ఏ టైం లో ఎస్ ఎస్ రాజమౌళి ఎన్టీఆర్ రామ్ చరణ్ లతో కలిసి ఆర్ ఆర్ ఆర్ సినిమాను మొదలు పెట్టాడో కానీ పరిస్థితులు ఏమాత్రం అనుకూలించక సినిమా మొదటి నుండి ఇబ్బందులు పడుతూనే ఉంది, ముందు అనుకున్న టైం కి జక్కన్న చెక్కడం లేట్ అవ్వడం వలన పోస్ట్ పోన్ అవ్వగా తర్వాత ఫస్ట్ వేవ్ అండ్ సెకెండ్ వేవ్ లు ఎంటర్ అవ్వడం తో పోస్ట్ పోన్ ల మీద పోస్ట్ పోన్ లు…
అవుతూ వస్తున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసి చూసి మళ్ళీ ఇప్పట్లో వచ్చే ఛాన్స్ లేదని తెలిసి అందరూ నిరాశ చెందుతున్నారు. మరో పక్క సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యి హీరోలిద్దరూ వేరే సినిమాలతో అయినా బిజీ అవుతారు అనుకుంటే…
షూటింగ్ కూడా ఇంకా కంప్లీట్ అవ్వడం లేదు, కానీ రీసెంట్ గా జార్జియా షూటింగ్ తర్వాత టోటల్ సినిమా పూర్తీ అయ్యిందని టీం వెల్లడించింది… దాంతో ఇక హీరోలు ఇద్దరూ ఫ్రీ అయినట్లే అనుకున్నారు కానీ మళ్ళీ ఇప్పుడు ఎదో పాచ్ వర్క్ షూటింగ్ బాలెన్స్ ఉందని…
ఇద్దరు హీరోలను మళ్ళీ జక్కన్న షూటింగ్ పిలిచాడట. వారం పది రోజుల వర్కింగ్ డేస్ షెడ్యూల్ మళ్ళీ పడుతుందని అంటున్నారు ఇప్పుడు… షూటింగ్ ఆల్ మోస్ట్ అయిపొయింది అంటూ ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నా సినిమా ఎంతకీ పూర్తీ అవ్వడం లేదనే చెప్పాలి… ఇప్పుడు ఎలాగూ రిలీజ్ డేట్ మళ్ళీ పోస్ట్ పోన్ అవ్వడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా రషెస్ అంతా చూసుకుని ఎక్కడైనా అవసరం అయితే…
మళ్ళీ జక్కన్న షూటింగ్ కి పిలిచే అవకాశం కూడా ఉందని అంటున్నారు. ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా అదే రేంజ్ లో బిజినెస్ పరంగా దుమ్ము లేపింది కాబట్టి జక్కన్న అంత పెర్ఫెక్షన్ కోరుకోవడంలో తప్పేమీ లేదని చెప్పొచ్చు. ఇప్పుడు బాలెన్స్ షూటింగ్ కూడా కంప్లీట్ చేసి కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు ఇస్తారు అన్నది ఆసక్తిగా మారింది..