ఆర్ ఆర్ ఆర్ బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ రిలీజ్ అయ్యి అల్టిమేట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. సినిమా బడ్జెట్ ఇండియన్ మూవీస్ లో ఆల్ టైం హైయెస్ట్ బడ్జెట్ తో తెరకేక్కినా కానీ ఆ బడ్జెట్ ను రికవరీ చేసి నిర్మాతలకు సాలిడ్ ప్రాఫిట్స్ ను థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ రైట్స్ తో సొంతం చేసుకోగా ఇప్పుడు సినిమాకి హాలీవుడ్ లో ఆస్కార్ రేసులో అలాగే…
ఇతర అవార్డుల కోసం వెళుతూ ఉండటంతో ఖర్చులు ఎక్కువగానే అవుతూ ఉండగా ఇండస్ట్రీ వర్గాల వార్తల ప్రకారం ఎన్టీఆర్, రామ్ చరణ్ మరియు రాజమౌళిలు తమ ఖర్చులతోనే ఈ ప్రమోషన్స్ చేస్తున్నారని తెలుస్తుంది. కానీ మొత్తం మీద ఇప్పటి వరకు సినిమా కోసం హాలీవుడ్ లో చేసిన…
ప్రమోషన్స్ కోసం ఏకంగా 80 కోట్ల రేంజ్ లో ఖర్చు చేశారు అంటూ టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ కం ప్రొడ్యూసర్ అయిన తమ్మారెడ్డి బరద్వాజ్ కామెంట్స్ చేశారు…. ఆ డబ్బుతో ఏ 8-10 సినిమాలు నిర్మించవచ్చు అంటూ కూడా కామెంట్స్ చేశారు… ఇది కూడా ఒకింత నిజమే అయినా కానీ…
ఆస్కార్ దాకా వెళ్ళడం అనేది ఏమాత్రం చిన్న విషయం కాదు, 8-10 సినిమాలు నిర్మించినా అందులో ఒక్క సినిమా అయినా ఇలాంటి కితాబుని అందుకునే అవకాశం ఉంటుందో ఉండదో చెప్పలేం. ఇప్పుడు ఆ అవకాశం ఉన్న ఆర్ ఆర్ ఆర్ ని మరింతగా పుష్ చేస్తే ఇండియన్ సినిమా పేరు మరింత పెరిగే అవకాశం, అప్ కమింగ్ హీరోల సినిమాలకు మరింత వైడ్ రీచ్ దక్కే అవకాశం ఉండటం వలెనే ఖర్చు పెరిగినా సినిమాను ప్రమోట్ చేస్తున్నారు అని చెప్పాలి.