Home గాసిప్స్ రవితేజ మాస్…ఈ రేంజ్ రెమ్యునరేషన్ ఏంటి సామి!!

రవితేజ మాస్…ఈ రేంజ్ రెమ్యునరేషన్ ఏంటి సామి!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్స్ కి ఫ్లాఫ్స్ కి సంభందం లేకుండా మాస్ మహారాజ్ రవితేజ సినిమాలు అంటే నాన్ థియేట్రికల్ బిజినెస్ రైట్స్ ఎప్పుడూ ఎక్స్ లెంట్ గా జరుగుతూ ఉంటాయి. అందుకే రవితేజ సినిమాల బడ్జెట్ కొంచం అటూ ఇటూ అయినా కలెక్షన్స్ అనుకున్న రేంజ్ లో రాకున్నా నిర్మాతలు చాలా సందర్బాలలో సేఫ్ అవుతూ ఉంటారు. ప్రస్తుతం క్రాక్ హిట్ తర్వాత ఖిలాడి ఫ్లాఫ్ అయినా వరుస పెట్టి సినిమాలు చేస్తున్న రవితేజ…

ఎవ్వరూ ఊహించని విధంగా మెగాస్టార్ చిరంజీవి 154వ సినిమా బాబీ డైరెక్షన్ లో చేస్తుండగా ఈ సినిమాలో చిరు తమ్ముడి రోల్ లో రవితేజ ని ఒప్పించి తీసుకున్నారు. రవితేజ స్పెషల్ ఎక్స్ టెండెడ్ క్యామియో రోల్ ఈ సినిమాలో వన్ ఆఫ్ ది హైలెట్ అవుతూ ఉండగా…

ఈ సినిమా కి గాను రవితేజ తక్కువ వర్కింగ్ డేస్ కి మాస్ రెమ్యునరేషన్ ని తీసుకోబోతున్నట్లు సమచారం. ట్రేడ్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం 40 రోజుల వర్కింగ్ డేస్ షూటింగ్ కి గాను 18 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ని రవితేజ కి ఇవ్వనున్నట్లు టాక్. రవితేజ సినిమాలకు హిందీ శాటిలైట్ రైట్స్ సాలిడ్ రేటు పలుకుతూ ఉంటాయి. ఈ అడ్వాంటేజ్ కూడా సినిమాకి ఇప్పుడు కలిసి రాబోతుంది అని చెప్పాలి. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి సందడి చేయబోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here