బాక్స్ ఆఫీస్ దగ్గర ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి హాలిడే అడ్వాంటేజ్ తో 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. సమంత నటించిన శాకుంతలం మరియు లారెన్స్ నటించిన రుద్రుడు సినిమాలు. 2 సినిమాలు కూడా పాజిటివ్ టాక్ అయితే సొంతం చేసుకోలేదు అని చెప్పాలి. కానీ పాన్ ఇండియా రేంజ్ లోనే రిలీజ్ అయిన ఈ రెండు సినిమాల్లో మంచి బజ్ ను సొంతం చేసుకున్న సమంత శాకుంతలం సినిమా ఓవర్సీస్ లో ప్రీమియర్స్ తో 80 వేలకు పైగా…
డాలర్స్ ను సొంతం చేసుకోగా తర్వాత టాక్ ఇంపాక్ట్ వలన కలెక్షన్స్ తగ్గడం స్టార్ట్ అవ్వగా తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్దగా ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోలేక పోయింది ఈ సినిమా. ఈ సినిమాతో పోల్చితే అసలు పెద్దగా ప్రమోషన్స్ లాంటివి ఏమి జరుపుకోకుండా…
ఆడియన్స్ ముందుకు వచ్చిన లారెన్స్ రుద్రుడు సినిమా మాస్ సెంటర్స్ లో కౌంటర్ దగ్గర టికెట్ సేల్స్ డీసెంట్ అనిపించే విధంగా ఉండగా కొన్ని చోట్ల శాకుంతలం కన్నా కూడా బుకింగ్స్ ఎక్కువగా ఉండటం విశేషం అని చెప్పాలి. మొత్తం మీద శాకుంతలం సినిమా తెలుగు రాష్ట్రాల్లో…
1 కోటి రేంజ్ లో ఓపెనింగ్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ట్రాక్ చేసిన సెంటర్స్ ని బట్టి రుద్రుడు సినిమా కోటికి పైగానే ఓపెనింగ్స్ ని అందుకునే అవకాశం ఉంది, అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి ఈ కలెక్షన్స్ అటూ ఇటూగా ఉండొచ్చు. మొత్తం మీద అసలు బజ్ లేని రుద్రుడు శాకుంతలం కన్నా బెటర్ ఓపెనింగ్స్ ని అందుకోబోతుంది. ఇక 2 సినిమాల అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.