Home న్యూస్ ఎపిక్ డిసాస్టర్ మూవీ కి సీక్వెల్ ఏంటి సామి…మైండ్ బ్లాంక్!!

ఎపిక్ డిసాస్టర్ మూవీ కి సీక్వెల్ ఏంటి సామి…మైండ్ బ్లాంక్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక సినిమా హిట్ అయితే ఆ సినిమా క్రేజ్ ను వాడుకోవడానికి ఆ సినిమాకి సీక్వెల్స్ లాంటివి తీసినా వర్కౌట్ అవుతుంది, కానీ ఒక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అట్టర్ డిసాస్టర్ అయినా కూడా ఆ సినిమా కి సీక్వెల్ ని అనౌన్స్ చేయడం ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలకు కూడా మైండ్ బ్లాంక్ అయ్యేలా చేస్తుంది అనే చెప్పాలి. ఆ సీక్వెల్ మూవీ దేనికో కాదు రీసెంట్ గా…

పాన్ ఇండియా రేంజ్ లో భారీగా రిలీజ్ అయ్యి బొక్క బోర్లా పడ్డ కబ్జా సినిమాకి…. ఆల్ మోస్ట్ కేజిఎఫ్ లాగానే తెరకెక్కిన ఈ సినిమా ఏ దశలో కూడా కేజిఎఫ్ ను మరిపించలేక పోయింది. కథ నత్తనడకన సాగడంతో ఆడియన్స్ సహనానికి పరీక్ష పెట్టిన ఈ సినిమా…

భారీ డిసాస్టర్ గా నిలిచింది. ఆల్ మోస్ట్ 110 కోట్ల రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 16 కోట్ల రేంజ్ షేర్ ని కూడా సాధించలేదు. అలాంటి ఈ సినిమా కి సీక్వెల్ ఉండబోతుందని సినిమా ఎండ్ లో చెప్పినా రిజల్ట్ చూసి వెనక్కి తగ్గుతారు అనుకుంటే ఇప్పుడు సీక్వెల్ కి స్క్రిప్ట్…

సిద్ధం అయ్యిందని పోస్టర్ రిలీజ్ ను చేసి అనౌన్స్ చేశారు. దాంతో ఎపిక్ డిసాస్టర్ అయిన సినిమాకి సీక్వెల్ ని అనౌన్స్ చేయడం ఏంటని అందరూ ఆశ్యర్యపోతున్నారు ఇప్పుడు. కానీ సీక్వెల్ లో మొదటి పార్ట్ లో చేసిన తప్పులు కాకుండా పకడ్బందీగా కథ ఉంటుందని అంటూ ఉన్నారు. మరి ఇదైనా మొదటి పార్ట్ నష్టాలను కవర్ చేస్తుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here