నట సింహం నందమూరి బాలకృష్ణ కే.ఎస్. రవికుమార్ ల కాంబినేషన్ లో వచ్చిన జై సింహా పర్వాలేదు అనిపించే టాక్ ని తెచ్చుకున్నా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది, ఏకంగా 35 కోట్ల కి పైగా షేర్ ని వసూల్ చేసింది, దానికి సంక్రాంతి పోటి లో డిసాస్టర్ అయిన అజ్ఞాతవాసి కూడా హెల్ప్ చేసిందని చెప్పాలి. దాంతో వీరి కాంబో లో ఇప్పుడు వచ్చిన రూలర్…
బాక్స్ ఆఫీస్ దగ్గర పోటి లో రిలీజ్ అయితే బెటర్ టాక్ వస్తే దుమ్ము లేపుతుందని, డిసెంబర్ 20 న రిలీజ్ చేశారు. పోటి లో ఫ్యామిలీ మూవీ ముందు వారం ఒకటి రిలీజ్ అవ్వడం రూలర్ కి పోటి గా మరో ఫ్యామిలీ మూవీ రిలీజ్ అవ్వడం తో రూలర్ కి పర్వాలేదు అనిపించే టాక్ ఉన్నా…
కలెక్షన్స్ మాత్రం రావడం లేదు. డిసెంబర్ 25 మంచి హాలిడే ఉన్న రోజు 2 చిన్న సినిమాలను వదిలివేయగా ఆ 2 సినిమాలు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్నాయి, అదే రూలర్ 25 న రిలీజ్ అయ్యి ఉంటె కచ్చితంగా పోటి లో కన్నా బెటర్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఉండేది.
బాక్స్ ఆఫీస్ దగ్గర పోటి లో ఇతర సినిమాలకు టాక్ బెటర్ గా ఉంటె ఆ దెబ్బ సాలిడ్ గా ఉంటుందని రూలర్ కలెక్షన్స్ ని చూస్తె అర్ధం అవుతుంది, సినిమా రిలీజ్ అయ్యి 6 రోజులు అవుతున్నా మొదటి రోజు తర్వాత టోటల్ చిల్లర కలెక్షన్స్ నే సొంతం చేసుకుంటూ రూలర్ పూర్తిగా రేసు నుండి తప్పుకుంది.
దాంతో ఇప్పుడు టోటల్ రన్ లో మినిమమ్ 11 నుండి 12 కోట్ల రేంజ్ లో కానీ….సెకెండ్ వీకెండ్ లో పుంజుకోకుంటే ఈజీ గా 13 కోట్ల నుండి 14 కోట్ల రేంజ్ నష్టాలను సినిమా సినిమా సొంతం చేసుకోవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దాంతో బాలయ్య ఖాతాలో 2019 హాట్రిక్ ఫ్లాఫ్స్ కంప్లీట్ అయ్యాయి.