యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా లెవల్ లో 350 కోట్ల రేంజ్ బడ్జెట్ తో అత్యంత భారీ ఎత్తున రూపొందించిన సినిమా సాహో, బాహుబలి తర్వాత భారీ లెవల్ లో రూపొందిన ఈ సినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో ఉండేవి, సినిమా రిలీజ్ అయిన తర్వాత టాక్ మాత్రం అనుకున్న రేంజ్ లో లేకపోవడం తో మంచి అవకాశాన్ని సినిమా వృధా చేసుకుందని, అంతా భావించారు.. కానీ…
సినిమా ఆ టాక్ తోనే హిందీ లో అల్టిమేట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా సౌత్ లో కూడా బిజినెస్ లో చాలా వరకు రికవరీ చేసి దుమ్ము లేపింది, ఇక సినిమా టెలివిజన్ ప్రీమియర్ మాత్రం చాలా ఆలస్యంగా టెలికాస్ట్ అయింది, అనుకున్న టైం కి అయ్యి ఉంటె మంచి రేటు దక్కేది కానీ..
నిర్మాతలు ఎక్కువ రేటు ఆశించడంతో రైట్స్ లేట్ గా అమ్ముడు పోయాయి, జీ తెలుగు వాళ్ళు ఈ సినిమాను 14.5 కోట్ల రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకోగా సినిమా రీసెంట్ గా టెలికాస్ట్ అయినప్పుడు మొదటి సారి డిసాస్టర్ అనిపించే విధంగా కేవలం…
5.81 రేటింగ్ ని మాత్రమే సొంతం చేసుకుని షాక్ ఇచ్చింది, తర్వాత వెంటనే మరో వారం గ్యాప్ తీసుకుని సినిమాను మళ్ళీ టెలికాస్ట్ చేశారు జీ తెలుగు వాళ్ళు, కాగా ఈ సారి కూడా పెద్దగా ఇంప్రూవ్ మెంట్ అయితే ఏమి లేదనే చెప్పాలి, సినిమాకి ఈ సారి కూడా షాకింగ్ రేటింగ్ దక్కింది. సినిమా రెండో సారి టెలికాస్ట్ అయినప్పుడు కేవలం…
4.11 రేటింగ్ ను మాత్రమే సొంతం చేసుకుని తెలుగు టెలివిజన్ లో డిసాస్టర్ రన్ ని కొనసాగిస్తుంది, రాంగ్ టైం లో టెలికాస్ట్ చేస్తూ ఉండటం ఈ రేటింగ్ కి ఒక కారణం అలాగే సినిమా ఎప్పుడో డిజిటల్ లో అందుబాటులో ఉండటం తో టెలివిజన్ లో పెద్దగా చూడటం లేదు అని తెలుస్తుంది, ఛానల్ తెరుకోవాలి అంటే సినిమా లాంగ్ రన్ లో మంచి రేటింగ్స్ ని అందుకోవాల్సి ఉంటుంది.