టాలీవుడ్ లో మేజర్ కలెక్షన్స్ వచ్చే ఏరియా లో నైజాం ఏరియా కూడా ఒకటి… ఓపెనింగ్స్ నుండి లాంగ్ రన్ వరకు ఇక్కడ కలెక్షన్స్ కి చాలా ఇంపాక్ట్ ఉంటుంది, స్టార్ హీరోల సినిమాలకు ఇక్కడ ఓపెనింగ్స్ కూడా ఓ రేంజ్ లో వస్తుంటాయి. బాహుబలి సిరీస్ తర్వాత ఇక్కడ జనతా గ్యారేజ్ మరియు జైలవకుశ సినిమాలతో నాన్ బాహుబలి రికార్డ్ ఓపెనింగ్స్ ని అందుకున్నాడు ఎన్టీఆర్. తర్వాత ఆ రికార్డ్ ను మహర్షి బ్రేక్ చేయగా…
ఆ రికార్డ్ సాహో భారీ మార్జిన్ తో బ్రేక్ చేసింది. ఇక ఇక్కడ తొలిరోజు హైయెస్ట్ థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాల్లో బాహుబలి సిరీస్ రెండు 400 నుండి 430 వరకు థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా ఆ రికార్డ్ ను బ్రేక్ చేసింది సాహో సినిమా… ఏకంగా…
450 వరకు థియేటర్స్ లో రిలీజ్ అయ్యి నాన్ బాహుబలి ఏంటి ఏకంగా న్యూ రికార్డ్ నే నమోదు చేసింది. ఇక మిగిలిన సినిమాల్లో అజ్ఞాతవాసి 405 థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా జైలవకుశ 385 థియేటర్స్ లో ఇక్కడ రిలీజ్ అయ్యింది. ఇక ఇప్పుడు సైరా నరసింహా రెడ్డి ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది అన్నది ఆసక్తి గా మారింది.
కాగా ఇప్పుడు సైరా సినిమా నైజాం ఏరియాలో 400 వరకు థియేటర్స్ ని కన్ఫాం చేసుకోగా రిలీజ్ సమయానికి 420 వరకు వెళ్ళే అవకాశం ఉందని సమాచారం. దాంతో ఓవరాల్ గా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రిలీజ్ లను సొంతం చేసుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది సైరా సినిమా…
ఒకసారి ఆల్ టైం టాప్ రిలీజ్ లను గమనిస్తే
?#Saaho – 450
?#Baahubali2 – 434
?#BaahuBali – 411
?#Agnyaathavaasi- 405
?#SyeRaa – 400*
?#JaiLavaKusa – 385
బాలీవుడ్ అండ్ హాలివుడ్ సినిమాల నుండి పోటి ఉన్నా సైరా కి నైజాం లో రికార్డ్ లెవల్ లో థియేటర్స్ దక్కాయి. ఇక సినిమా కి మొదటి రోజు ఇక్కడ ఎలాంటి కలెక్షన్స్ దక్కుతాయి అన్నది ఆసక్తిగా మారింది… చూద్దాం మొదటి రోజు సైరా బాక్స్ ఆఫీస్ ఊచకోత ఏ రేంజ్ లో ఉంటుందో…