యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సెన్సేషనల్ 350 కోట్ల సినిమా సాహో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అయ్యింది, బాక్స్ ఆఫీస్ బరిలో తెలుగు హిందీ భాషల్లో భారీ క్రేజ్ నడుమ రిలీజ్ అవుతున్న ఈ సినిమా మిగిలిన భాషల్లో టాక్ పై డిపెండ్ అయ్యి ఉందని చెప్పొచ్చు. తెలుగు రాష్ట్రాలలో సినిమా ప్రతీ 3 థియేటర్స్ లో రెండు థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది అంటే క్రేజ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 1550 థియేటర్స్ అండ్ అందులో 1850 కి పైగా స్క్రీన్స్ ఉన్నాయి. కాగా ఇప్పుడు సాహో సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 1300 కి పైగా థియేటర్స్ లో 1550 వరకు స్క్రీన్స్ లో రిలీజ్ కాబోతుందని సమాచారం. ఇందులో కూడా నైజాం లో 430 లోపు థియేటర్స్ లో…
సీడెడ్ లో 320 వరకు థియేటర్స్ లో ఇక టోటల్ ఆంధ్రా రీజన్ లో 550 కి పైగా థియేటర్స్ లో సినిమా రిలీజ్ కాబోతుంది, ఓవరాల్ గా 1300 థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా టాలీవుడ్ హిస్టరీ లో సెకెండ్ హైయెస్ట్ థియేటర్స్ కౌంట్ లో ఒకటి అని చెప్పొచ్చు.
ఇది వరకు బాహుబలి రెండో పార్ట్ రెండు తెలుగు రాష్ట్రాలలో 1350 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ ని సొంతం చేసుకుంది, ఓవరాల్ గా సాహో ఇప్పుడు రెండో ప్లేస్ ని సొంతం చేసుకోగా క్రేజ్ దృశ్యా ఇప్పుడు ఎలాంటి ఓపెనింగ్స్ ని అందుకుంటుంది అన్నది ఆసక్తిగా మారింది. కొన్ని సెంటర్స్ లో సినిమా టికెట్ రేట్లు…
బాహుబలి 2 ని కూడా మించే విధంగా ఉండటం రెండు తెలుగు రాష్ట్రాలలో హైర్స్ రికార్డ్ లెవల్ లో 17 కోట్ల దాకా ఉండటం తో డే 1 హిస్టారికల్ కలెక్షన్స్ ని సాధించడానికి ఇది అల్టిమేట్ అడ్వాంటేజ్ గా మారుతుందని చెప్పొచ్చు. మరి సినిమా ఇన్ని అడ్వాంటేజ్ ల నడుమ ఎలాంటి రికార్డులను నమోదు చేస్తుందో చూడాలి.