యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సెన్సేషనల్ సాహో బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపడానికి భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది, సినిమా ఓవరాల్ గా సాధించిన బిజినెస్ ఏకంగా 270 కోట్లకు పైగా ఉండగా సినిమా హిందీ లో ఇది వరకు 100 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసినప్పటికీ అది ఆగస్ట్ 15 డేట్ ని బేస్ చేసుకుని జరగగా తర్వాత డేట్ చేంజ్ అవ్వడం తో బిజినెస్ తగ్గి 60 కోట్లకు పైగా బిజినెస్ చేసింది.
దాంతో అక్కడ హిట్ అవ్వాలి అంటే 110 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సినిమా సాధించాల్సి ఉంటుంది, ఇక సినిమా హిందీ వర్షన్ ఇండియా లో బిగ్గెస్ట్ రిలీజ్ ని సొంతం చేసుకోబోతుంది, నార్త్ అండ్ సౌత్ లో కూడా హిందీ వర్షన్ రిలీజ్ కానుండగా టోటల్ గా థియేటర్స్ కౌంట్…
3500 కి పైగానే ఉండే అవకాశం ఉందని సమాచారం, ఇది నిజంగానే రికార్డ్ లెవల్ రిలీజ్ అని చెప్పాలి. బాహుబలి 2 తర్వాత ఈ రేంజ్ లో రిలీజ్ అవుతుండటం తో ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా సినిమా దుమ్ము లేపే కలెక్షన్స్ తో సంచలనం సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.