యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో సినిమా పాన్ ఇండియా లెవల్ లో ఎలా దుమ్ము లేపిందో అందరికీ తెలిసిందే. సినిమా రిలీజ్ అవ్వక ముందు ఊహకందని క్రేజ్ తో రిలీజ్ అవ్వగా రిలీజ్ అయిన తర్వాత డిసాస్టర్ టాక్ ను సొంతం చేసుకున్న సినిమా ఆ టాక్ తోనే తెలుగు లో 100 కోట్లకు పైగా కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా హిందీ లో ఆ టాక్ తోనే ఏకంగా సూపర్ హిట్ రిజల్ట్ ను సొంతం చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది.
ఈ సినిమా తో ప్రభాస్ క్రేజ్ పవర్ ఏంటి అనేది అందరికీ క్రిస్టల్ క్లియర్ అవ్వగా ఈ సినిమా తర్వాత ఇతర దేశాల్లో కూడా రిలీజ్ అయ్యింది కానీ ఎక్కడా పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపలేక పోయింది, కానీ ఈ సినిమా ఇప్పుడు జపాన్ దేశంలో సంచలనాలను సృష్టిస్తూనే…
ఉండటం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది అని చెప్పాలి. జపాన్ లో కరోనా వలన కొంత ఇబ్బంది పడి తర్వాత తేరుకుని థియేటర్స్ అన్నీ ఎప్పుడో ఓపెన్ అవ్వగా ఈ సినిమాను అక్కడ రిలీజ్ చేశారు. కాగా సినిమా రీసెంట్ గా అక్కడ పరుగును ఇంకా కంటిన్యు చేస్తుంది అన్న న్యూస్…
బయటకి రాగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది, ఈ సినిమా అక్కడ ఆగకుండా ఏకంగా 250 రోజులకు పైగా కంటిన్యు గా థియేటర్స్ లో రన్ ని కొనసాగిస్తూ దూసుకు పోతుందని సమాచారం. ఇది నిజంగానే షాకింగ్ అండ్ సెన్సేషనల్ రికార్డ్ అని చెప్పొచ్చు. ఈ రేంజ్ లో పరుగును అక్కడ సొంతం చేసుకున్న అతి కొద్ది సినిమాల్లో ఒకటిగా ఈ సినిమా నిలిచింది అని అంటున్నారు.
ఇక సినిమా అక్కడ సాధించిన కలెక్షన్స్ లెక్కలు ఏవి కూడా పెద్దగా ఆక్యురేట్ గా లేవు కానీ జపాన్ యెన్స్ లో 150 మిలియన్స్ కి పైగా యెన్స్ ని సినిమా సాధించింది అంటున్నారు. అంటే ఇండియన్ కరెన్సీ లో ఈ లెక్క అటూ ఇటూగా 11 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు. కలెక్షన్స్ పై మరింత స్పష్టత వచ్చాక మళ్ళీ క్లియర్ గా కలెక్షన్స్ లెక్కలను అప్ డేట్ చేస్తాం…