యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సెన్సేషనల్ పాన్ ఇండియా మూవీ సాహో బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ డిసాస్టర్ టాక్ తో కూడా ఎవ్వరూ ఊహించని రేంజ్ లో కలెక్షన్స్ తో విరుచుకుపడింది, చాలా మొత్తాన్ని వెనక్కి తెచ్చిన ఈ సినిమా హిందీ వర్షన్ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది, హిందీ టెలివిజన్ రేటింగ్స్ కూడా సాలిడ్ గా వచ్చాయి. కానీ తెలుగు లో వచ్చే సరికి నిర్మాతల అత్యాశ భారీ దెబ్బ కొట్టింది.
సినిమాను 30 కోట్లకి శాటిలైట్ రైట్స్ అమ్మాలని ఫిక్స్ అయిన మేకర్స్… 24 కోట్ల రేంజ్ దాకా ఆఫర్ చేసిన జెమినీ టీవీ, స్టార్ మా ఆఫర్స్ ని రిజక్ట్ చేయగా తర్వాత సినిమా రిజల్ట్ వలన ఎవ్వరూ సినిమా హక్కులను కొనడానికి ముందుకు రాలేదు, జీ తెలుగుతో…
భేరసారాలు చాలా నెలలు కొనసాగి చివరికి సినిమాను 14.5 కోట్లకు తెలుగు శాటిలైట్ రైట్స్ ని అమ్మారు…. కాగా టెలికాస్ట్ చేసేది అయినా మంచి టైం చూసుకుని టెలికాస్ట్ చేయకుండా IPL మ్యాచ్ టైం లో టెలికాస్ట్ చేయడం ఫ్యామిలీ ఆడియన్స్ కి పెద్దగా కనెక్ట్ అయ్యే మూవీ కాకపోవడం…
అప్పటికే మాస్టర్ ప్రింట్ వచ్చి ఏడాది అవ్వడం లాంటి అనేక రీజన్స్ కలిసి సినిమా ఇప్పుడు ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు కేవలం 5.81 TRP రేటింగ్ ని మాత్రమే సొంతం చేసుకుంది, ఇది టాలీవుడ్ స్టార్ హీరోలలో వన్ ఆఫ్ ది లోవెస్ట్ TRP రేటింగ్స్ లో ఒకటిగా చెప్పుకోవాలని… TRP తక్కువ రావడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ…
సినిమాను ఛానెల్ కొన్న రేటు ప్రకారం చూసుకుంటే మాత్రం ఎపిక్ డిసాస్టర్ TRP రేటింగ్ అనే చెప్పాలి.. ఇలాంటి డిసాస్టర్ రేటింగ్ కి యూనిట్ సరైన టైం లో రియాక్ట్ అయ్యి సినిమాను అమ్మక పోవడం అతి పెద్ద తప్పుగా భావించవచ్చు, బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ టాక్ తో రాంపేజ్ చూపినప్పటికీ టెలివిజన్ లో మాత్రం సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది ఇప్పుడు.