బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్, ఆదిత్య రాయ్ కపూర్ కాంబినేషన్ లో సంజయ్ దత్ ముఖ్య పాత్రలో మహేష్ భట్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ సడక్ 2… బాలీవుడ్ లో ఇది వరకు సూపర్ హిట్ అయిన సడక్ సినిమా కి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా పై రీసెంట్ టైం లో ఎప్పుడూ లేనంత వ్యతిరేకత వచ్చిన విషయం అందరికీ తెలిసిందే, సుశాంత్ మరణంతో లింక్ ఉన్న రియా చక్రవర్తికి…
గురువు గా చెప్పుకుంటున్న మహేష్ భట్ నిర్మాణంలో సినిమా రావడం, మహేష్ భట్ కి కూడా లింక్ ఉందని అంటూ ఉండటం, అందరూ స్టార్ కిడ్స్ తోనే సినిమా తెరకేక్కడం, ఆలియా భట్ ఇది వరకు కరణ్ జోహార్ షో లో సుశాంత్ పై అనుకోకుండా చేసిన కామెంట్స్…
ఇలా అనేక కారణాలు సినిమా కి ప్రతికూలంగా మారి సినిమా పై అత్యంత భారీ వ్యతిరేకత మొదలు అయింది. ట్రైలర్ కి ఆల్ మోస్ట్ 11 మిలియన్స్ డిస్ లైక్స్ తో వరల్డ్ రికార్డ్ కొట్టగా ఇప్పుడు సినిమా త్వరలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కాబోతుంది.
కాగా ఈ సినిమా ను సుమారు 35 కోట్ల రేంజ్ బడ్జెట్ తో నిర్మించగా సినిమా ను డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ సాలిడ్ రేటుకే అమ్మారని సమచారం. ట్రేడ్ లో వినిపిస్తున్న లెక్కల ప్రకారం సినిమా 65 కోట్ల రేంజ్ రేటు కి ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని అమ్మారని అంటున్నారు. ఇక మ్యూజిక్ రైట్స్ శాటిలైట్ రైట్స్ లెక్కలు తేలాల్సి ఉంది.
మొత్తం మీద ట్రైలర్ కి వచ్చిన విపరీతమైన నెగటివ్ ఫీడ్ బ్యాక్ చూసి యూనిట్ మొత్తం షాక్ కి గురి అయ్యారట. ఇక సినిమా అయినా చూస్తారా లేదా అని OTT రైట్స్ కొన్న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కొంచం టెన్షన్ లో ఉందని అంటున్నారు. సినిమా ఈ నెల 28 న డైరెక్ట్ రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది.