ఇది వరకు ఎప్పుడూ జరగనిది ఇప్పుడు జరుగుతుంది, నెపోటిజం మీద కోపంగా ఉన్న ఫ్యాన్స్ అందరూ బాలీవుడ్ సినిమాలను హేట్ చేస్తూనే నెపో కిడ్స్ మూవీస్ ని ముఖ్యంగా టార్గెట్ చేయడం మొదలు పెట్టారు, సుశాంత్ పై ప్రేమతో వీరందరిపై కోపాన్ని చూపుతున్నారు. రీసెంట్ గా ఆలియా భట్, సంజయ్ దత్ మరియు ఆదిత్య రాయ్ కపూర్ ల కాంబినేషన్ లో మహేష్ భట్ డైరెక్షన్ లో ముకేష్ భట్ నిర్మించిన…
కంప్లీట్ నెపో కిడ్స్ అసోసియేట్ అయిన సడక్ 2 సినిమా ట్రైలర్ రిలీజ్ అవ్వగా సుశాంత్ ఫ్యాన్స్ అందరూ సినిమా ట్రైలర్ పై డిస్ లైక్స్ తో విరుచుకు పడ్డారు, ఎంతలా అంటే సినిమా ట్రైలర్ కొద్ది సేపట్లోనే ఇండియా లోనే హైయెస్ట్ డిస్ లైక్స్ ని సాధించిన ట్రైలర్ గా నిలవగా…
కొన్ని గంటలకే వరల్డ్ లోనే హైయెస్ట్ డిస్ లైక్స్ ని సాధించిన ట్రైలర్ గా నిలచి షాక్ ఇచ్చింది, ఇక ఇప్పుడు వరల్డ్ లోనే యూట్యూబ్ లో రిలీజ్ అయిన వీడియోలలో డిస్ లైక్స్ ని సాధించిన వీడియోలలో ఒకటిగా నిలిచి కంటిన్యుగా డిస్ లైక్స్ తో షాక్ ఇస్తూనే ఉంది.
ఒకసారి వరల్డ్ లో టాప్ 5 డిస్ లైక్స్ ని సాధించిన వీడియోలను గమనిస్తే..
1. YouTube Rewind 2018- 18.18M
2. Justin Bieber(Baby) – 11.57M
3. #Sadak2Trailer – 10M***
4. YouTube Rewind 2019- 9.09M
5. Baby Shark Dance” – 8.88M
6. Учим цвета-Разноцветные яйца на ферме: 6.96M
వరల్డ్ లో నే ఏకంగా టాప్ 5 ప్లేస్ లో నిలిచింది ఈ సినిమా..
కచ్చితంగా రానున్న రోజుల్లో ఈ ట్రైలర్ టాప్ 3 లో ఒకటిగా నిలిచే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక ట్రైలర్ ని యూట్యూబ్ లో వేల మంది రిపోర్ట్ కొడుతున్నారు, దాంతో యూట్యూబ్ ఈ ట్రైలర్ ని డిలేట్ చేసినా ఆశ్యర్యం లేదని అంటున్నారు. ఒక వ్యక్తికి జరిగిన అన్యాయాన్ని నిలదీస్తూ అందరి ఫ్యాన్స్ ఏకం అయ్యి టోటల్ బాలీవుడ్ నే శాసించబోతున్నారు ఇప్పుడు.