Home న్యూస్ బయోపిక్స్ లో ఇలాంటి డిసాస్టర్ చూసి ఉండరు…ఆ రేటింగ్ ఏంటి…ఈ చిల్లర కలెక్షన్స్ ఏంటి సామి!!

బయోపిక్స్ లో ఇలాంటి డిసాస్టర్ చూసి ఉండరు…ఆ రేటింగ్ ఏంటి…ఈ చిల్లర కలెక్షన్స్ ఏంటి సామి!!

0

  క్రికెట్ లో సచిన్ గురించి బ్యాడ్మింటన్ లో సైనా నెహ్వాల్ గురించి తెలియని వాళ్ళు ఉండరు, అలాంటి సైనా నెహ్వాల్ లైఫ్ స్టొరీ ని మూవీ లా మార్చి తీసిన సినిమా సైనా… సైనా నెహ్వాల్ పాత్రలో పరిణితి చోప్రా నటించిన ఈ బయోపిక్ మూవీ టీసర్ ట్రైలర్ లు పెద్దగా ఆకట్టుకోలేదు, దాంతో సినిమా పై చాలా తక్కువ బజ్ ఉండగా సినిమా రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చింది.

సినిమా చూసిన వాళ్ళు అందరూ కూడా ఇది బయోపిక్స్ లో వీక్ స్టొరీ ఉన్న బయోపిక్ గా కన్ఫాం చేశారు, బాలీవుడ్ లో బయోపిక్ కల్చర్ ఎక్కువ అవ్వగా భాగ్ మిల్కా భాగ్, ధోని, మేరికోమ్ లాంటి కొన్ని సినిమాలే ఆడియన్స్ అంచనాలను అందుకుంటూ ఉండగా… చాలా సినిమాలు ఆడియన్స్ అంచనాలను అందుకోలేక..

బాక్స్ ఆఫీస్ దగ్గర బొక్క బోర్ల పడుతున్నాయి. ఇప్పుడు ఈ కోవలోకే వచ్చే సినిమాగా సైనా సినిమా గురించి చెప్పుకోవాలి, రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా చూసిన వాళ్ళు అందరూ కూడా ఏమాత్రం బాలేదని కామెంట్స్ చేయగా సైనా రోల్ లో పరిణితి అసలు ఏమాత్రం సెట్ కాలేదని…

తేల్చేయడం లాంటివి తీవ్రంగా ఇంపాక్ట్ చూపాయి, సైనా గురించి ప్రతీ ఒకరికీ తెలిసిందే, అలాంటిది ఇతర బయోపిక్స్ లో మాదిరిగా తెలియని అంశాలు ఆడియన్స్ ను ఎంగేజ్ చేసే సీన్స్ పెద్దగా లేక పోవడం తో సినిమా 2 స్టార్ రేంజ్ రేటింగ్ బాలీవుడ్ లో లభించగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా మొదటి రోజు 20 లక్షలు, రెండో రోజు 30 లక్షలు…

మూడో రోజు 35 లక్షలు ఇలా మూడు రోజులు కలిపి ఎంటైర్ ఇండియా లో 1300 స్క్రీన్స్ లో కేవలం 85 లక్షల నెట్ కలెక్షన్స్ ని మాత్రమే సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మతిరిగే డిసాస్టర్ గా నిలిచింది. ఈ కలెక్షన్స్ చూసి బయోపిక్స్ లోనే బిగ్గెస్ట్ డిసాస్టర్ మూవీ ఈ సినిమా నే అని అక్కడ వాళ్ళు తేల్చేసి చెబుతుండటం విచారకరం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here