Home న్యూస్ 3 రెట్లతో డంకిని ఓడించిన సలార్…..2 వెయ్యి కోట్ల SRK కి చుక్కెదురు!

3 రెట్లతో డంకిని ఓడించిన సలార్…..2 వెయ్యి కోట్ల SRK కి చుక్కెదురు!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ ఇండియన్ హీరోలలో అల్టిమేట్ ఫామ్ లో ఉన్న హీరోలలో అందరికన్నా ముందు నిలిచే హీరో బాలీవుడ్ బాద్ షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) ఎప్పటి నుండో వరుస ఫ్లాఫ్స్ తో సతమతం అవుతున్న షారుఖ్ ఖాన్ కి ఈ ఇయర్ పఠాన్(Pathaan) మరియు జవాన్(Jawan) సినిమాలతో…

ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ సక్సెస్ లు సొంతం అయ్యాయి. 1000 కోట్లకు పైగా గ్రాస్ తో ఏకంగా ఏ హీరోకి లేని రికార్డ్ కొట్టిన తర్వాత బాలీవుడ్ లో నంబర్ 1 డైరెక్టర్ అయిన రాజ్ కుమార్ హిరాణి(Raj Kumar Hirani) తో చేసిన డంకి(Dunki Movie) రీసెంట్ గా రిలీజ్ అవ్వగా పర్వాలేదు అనిపించే టాక్ తో…

మొదటి రోజు కేవలం 58 కోట్ల రేంజ్ లోనే గ్రాస్ ను అందుకోగా ఈ ఇయర్ ఆదిపురుష్ తో ఫ్లాఫ్ అందుకుని రీసెంట్ టైంలో హిట్ లేకుండా ఉన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో చేసిన సలార్(Salaar) తో క్రిస్టమస్ వీకెండ్ లో పోటికి సిద్ధం అవ్వగా అందరూ…

షారుఖ్ సినిమాతో పోటిలో ప్రభాస్ కే దెబ్బ పడే ఛాన్స్ ఉందని అనుకున్నారు. కానీ మొదటి రోజు కలెక్షన్స్ పరంగా సలార్ 167 కోట్ల రేంజ్ లో గ్రాస్ తో ఆల్ మోస్ట్ డంకి కన్నా మూడు రెట్లు ఎక్కువ వసూళ్లు అందుకుంది… డంకి క్లాస్ మూవీ సలార్ ఊరమాస్ మూవీ అయినా కూడా…

2 సార్లు 1000 కోట్ల మార్క్ ని అందుకున్న హీరో, నంబర్ 1 డైరెక్టర్ ల క్రేజీ కాంబో మూవీ మీద వరుస ఫ్లాఫ్స్ తో ఉన్న ప్రభాస్ ఒక్క మాస్ మూవీతో ప్రశాంత్ నీల్ తో కలిసి ఈ రేంజ్ లో డే 1 కలెక్షన్స్ తోనే డామినేట్ చేయడం విశేషం, ఇక లాంగ్ రన్ లో ఏ సినిమా భారీ వసూళ్ళతో రచ్చ చేస్తుంది అన్నది ఆసక్తి కరం అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here