Home న్యూస్ సలార్ పై డంకి టీం జులుమ్…..సింగిల్ స్క్రీన్స్ ఇవ్వొద్దు అంటూ గొడవ!

సలార్ పై డంకి టీం జులుమ్…..సింగిల్ స్క్రీన్స్ ఇవ్వొద్దు అంటూ గొడవ!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ లోనే బిగ్గెస్ట్ క్లాష్ ఈ క్రిస్టమస్ వీకెండ్ లో జరగబోతుంది. పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas), కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) నటించిన డంకి(Dunki Movie) లు ఒకే రోజులో పోటి పడటానికి సిద్ధం అవుతూ ఉండగా రెండు సినిమాల్లో ప్రస్తుతానికి…

సలార్ మూవీ మీద హైప్ మరో లెవల్ లో ఉండగా 2 సార్లు 1000 కోట్ల గ్రాస్ ను అందుకున్న షారుఖ్ ఖాన్ బాలీవుడ్ నంబర్ 1 డైరెక్టర్ అయిన రాజ్ కుమార్ హిరాణి డైరెక్షన్ లో చేస్తున్న డంకి క్లాస్ మూవీ అవ్వడంతో మౌత్ టాక్ నే నమ్ముకుని రిలీజ్ కానుంది… హిందీలో కూడా సలార్ కి మాస్ సెంటర్స్ లో సాలిడ్ బజ్ ఉంది…

కానీ ఇప్పుడు రిలీజ్ దగ్గర పడుతున్న కొద్ది డంకి టీం సలార్ కి థియేటర్స్ హిందీలో సొంతం అవ్వకుండా చేస్తున్నట్లు మీడియాలో స్ట్రాంగ్ గా కథనాలు వస్తున్నాయి…. మ్యాటర్ లోకి మస్తే ఈ నెలలో వచ్చిన యానిమల్ రిలీజ్ టైంలో మేకర్స్ సలార్ ను యానిమల్ థియేటర్స్ లో రిలీజ్ చేస్తామని ఒప్పుకుంటేనే యానిమల్ ని రిలీజ్ చేస్తామాని…

కండీషన్ పెట్టిన టైంలో డంకి టీం యానిమల్ మేకర్స్ దగ్గరకు వచ్చి ఉన్న థియేటర్స్ ని చేరి సగం పంచుకుందామని మాట్లాడుకున్నారట. కానీ ఇప్పుడు డంకి టీం టాప్ డిస్ట్రిబ్యూషన్ చైన్స్ అండ్ థియేటర్స్ వాళ్ళతో మీటింగ్ జరుపుతూ…హిట్స్ లేక భాదపడుతున్న థియేటర్స్ వాళ్ళని…

ఈ ఇయర్ 2 సార్లు 1000 కోట్ల సినిమాలతో ఆదుకున్న షారుఖ్ కొత్త సినిమాకి మీ అవసరం ఉందని, సింగిల్ స్క్రీన్స్ లో సౌత్ సినిమాని వేయకుండా అన్ని స్క్రీన్స్ లో డంకి సినిమానే వేయాలని ప్రెజర్ చేస్తున్నారట. ఈ న్యూస్ ఇప్పుడు బాలీవుడ్ మీడియాతో పాటు సౌత్ లో కూడా చక్కర్లు కొడుతూ ఉండటంతో…

డంకి టీం చేస్తున్న ఈ పనులు చూసి అందరూ ఓపెన్ గానే ట్రోల్ చేస్తున్నారు. మరో పక్క బుకింగ్స్ పరంగా సలార్ బుకింగ్స్ ని చాలా తక్కువ చోట్ల ఓపెన్ చేయగా డంకికి అన్ని చోట్లా బుకింగ్స్ ఓపెన్ చేసినా రెస్పాన్స్ అంతంత మాత్రమే ఉండగా మౌత్ టాక్ నే సినిమా ఎక్కువగా నమ్ముకుంది. ఇక రిలీజ్ టైంకి 2 సినిమాలకు ఎలాంటి థియేటర్స్ దొరుకుతాయో చూడాలి ఇక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here