Home న్యూస్ సలార్ రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

సలార్ రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

0

ఈ ఇయర్ వన్ ఆఫ్ మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ముందు నిలిచే సినిమా అయిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ప్రశాంత్ నీల్(Prashanth Neel) ల కాంబినేషన్ లో వచ్చిన సెన్సేషనల్ మూవీ సలార్(salaar part 1 – ceasefire) సినిమా భారీ లెవల్ లో రిలీజ్ ను సొంతం చేసుకుంది… ఎప్పటి నుండో మాస్ మూవీ చేయని ప్రభాస్ ని ప్రశాంత్ నీల్ ఏ రేంజ్ లో మాస్ గా చూపించాడో తెలుసుకుందాం పదండీ..

ముందుగా కథ పాయింట్ కి వస్తే ఖాన్సార్ సామ్రాజ్యానికి రాజు కొడుకు అయిన పృద్విరాజ్(Prithviraj) మరియు ప్రభాస్ లు చిన్నప్పటి నుండి ప్రాణ స్నేహితులు, తన స్నేహితుడికి ఏమైనా ఆపద వస్తే నన్ను పిలువు అంటాడు హీరో… తర్వాత అనుకోకుండా పెద్దయ్యాక పృద్విరాజ్ కి ప్రభాస్ సహాయం అవసరం అవుతుంది, దానికి కారణం ఏంటి….ఆ తర్వాత కథ ఏముయింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…

పెర్ఫార్మెన్స్ పరంగా ప్రభాస్ ది చాలా సటిల్డ్ రోల్ ఈ సినిమాలో, డైలాగ్స్ పెద్దగా ఉండవు, కానీ ప్రభాస్ స్క్రీన్ ప్రజెన్స్ అండ్ మాస్ యాక్షన్ సీన్స్, ఎలివేషన్లు అన్నీ ఓ రేంజ్ లో అదరగొట్టేశాడు. ప్రభాస్ నుండి ఈ రేంజ్ లో యాక్షన్ సీన్స్ వచ్చి చాలా చాలా ఏళ్ళు అవ్వడంతో ఫ్యాన్స్ అండ్ యాక్షన్ సీన్స్ ఇష్టపడే ఆడియన్స్ కి పండగే అని చెప్పాలి…. ఇక పృద్విరాజ్ రోల్ కూడా ఉన్నంతలో ఆకట్టుకోగా, ఇద్దరి సీన్స్ కూడా బాగా వచ్చాయి…. 

ఇక శృతిహాసన్ రోల్ మరీ ఓవర్ ది టాప్ అనిపించి బోర్ కొట్టించింది, అలాగే ఈశ్వరి రావ్ రోల్ కూడా కొంచం అలానే అనిపించగా జగపతిబాబు, బాబీ సింహ ఉన్నంతలో ఆకట్టుకున్నారు, మిగిలిన యాక్టర్స్ పర్వాలేదు. ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఇంకొంచం గట్టిగా చేసి లెంత్ ని తగ్గించి ఉంటే ఇంకా బాడుండేది… కొన్ని సీన్స్ డ్రాగ్ అయ్యి, స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల…

ఎటు నుండి ఏటో వెళ్ళిన ఫీలింగ్ కలిగింది, ఇక సంగీతం బాగుండగా బ్యాగ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్ కి అదిరిపోయినా ఓవరాల్ గా కేజిఎఫ్ రేంజ్ లో కిక్ అయితే బ్యాగ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదు… ఇక సినిమాటోగ్రఫీ ఎక్స్ లెంట్ గా ఉండగా ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాట్చ్ అనిపించేలా ఉన్నాయి. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే ప్రశాంత్ నీల్ ఉగ్రం కథనే తీసుకుని…

ప్రభాస్ కి సెట్ అయ్యే అన్ని ఎలిమెంట్స్ ను సెట్ చేశాడు, హీరోయిజం ఎలివేట్ సీన్స్ కుమ్మేశాడు, కానీ కథ పాయింట్ సింపుల్ గానే ఉండటం, కొన్ని అనవసరపు సీన్స్ తో కొంచం లాగ్ చేయడం లాంటివి చేయకుండా ఉంటే సినిమా మరో లెవల్ లో ఉండేది, అయినా కానీ సలార్ సినిమా భారీ అంచనాలతో వెళ్ళే ఆడియన్స్ ను సాటిస్ ఫై చేయడంలో సఫలం అయింది అనే చెప్పాలి…

సినిమాలో హైలెట్స్ విషయానికి వస్తే ప్రభాస్ ఊరమాస్ కటౌట్ అండ్ ఎలివేషన్ సీన్స్, సూపర్బ్ ఇంటర్వెల్ అండ్ ఎక్స్ లెంట్ క్లైమాక్స్ లు, సెకెండ్ ఆఫ్ మాస్ యాక్షన్ సీన్స్ మేజర్ ప్లస్ పాయింట్స్ అని చెప్పాలి. ఇక మైనస్ ల విషయానికి వస్తే సినిమాలో చూపించిన ఎమోషన్స్ పెద్దగా కనెక్ట్ అయ్యేలా లేక పోవడం, కొన్ని చోట్ల డ్రాగ్ అయినట్లు అనిపించడం లాంటివి డ్రా బ్యాక్స్ అయినా కూడా ఈజీగా వాటిని మర్చిపోయి సినిమాను ఎంజాయ్ చేయోచ్చు…

మొత్తం మీద సినిమా అంచనాలను అందుకుందా లేదా అంటే మాత్రం అందుకుంది అనే చెప్పాలి. ఇది పక్కా మాస్ అండ్ యాక్షన్ మూవీ అని అందరికీ తెలుసు కాబట్టి అదే మైండ్ లో పెట్టుకుని థియేటర్స్ కి వెళితే లెంత్ కొంచం ఎక్కువ అయినా సినిమా అయిపోయిన టైంకి ఏం మాస్ మూవీ చూశాం రా అని అనుకుంటూ బయటికి వస్తారు… ఓవరాల్ గా సినిమా కి మా రేటింగ్ 3 స్టార్స్….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here