Home న్యూస్ సలార్ Vs డంకి….ఈ థియేటర్స్ గొడవ ఏంటి సామి!!

సలార్ Vs డంకి….ఈ థియేటర్స్ గొడవ ఏంటి సామి!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో 2 భారీ క్రేజ్ ఉన్న సినిమాలు రిలీజ్ కి సిద్ధం అయ్యాయి. వాటిలో పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన సలార్(Salaar Movie) బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) నటించిన డంకి(Dunki Movie) సినిమాలు ఒక్క రోజు గ్యాప్ తో…

భారీ పోటిలో రిలీజ్ అవుతూ ఉండగా రెండు సినిమాలు డిఫెరెంట్ జానర్ మూవీస్ అవ్వడంతో ఒక సినిమాకి ఒకటి పోటి కాక పోయినా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లాస్ మూవీ అండ్ మాస్ కమర్షియల్ మూవీల పోటిలో కమర్షియల్ మూవీ ఎప్పుడూ విన్ అవుతుంది కాబట్టి ఈ సారి కూడా ఎడ్జ్ క్లియర్ గా సలార్ వైపే ఉంది…

దాంతో థియేటర్స్ కూడా భారీ లెవల్ లో ఈ సినిమాకే సొంతం అయ్యే అవకాశం ఉండగా ఇది వరకే డంకి టీం అండ్ సలార్ టీం లు థియేటర్స్ ని సగం సగం పంచుకోవాలని డిసైడ్ అయినా కూడా ఇప్పుడు డంకి టీం ప్లేట్ మార్చేసి డంకి కి అన్ని సింగిల్ స్క్రీన్స్ లో రిలీజ్ చేయబోతున్నారు.

ఇండియా లో బిగ్గెస్ట్ మూవీ చెయిన్ అయిన PVR వాళ్ళు కూడా ఆల్ మోస్ట్ అన్ని సింగిల్ స్క్రీన్స్  లో డంకి సినిమా బుకింగ్స్ నే లాంగ్ వీకెండ్ లో అన్ని షోలకు ఓపెన్ చేయగా సలార్ కి చాలా చాలా తక్కువ షోలు వేశారు…. దాంతో సౌత్ లో PVR థియేటర్స్ లో సలార్ బుకింగ్స్ అస్సలు ఓపెన్ అవ్వలేదు…

మేకర్స్ కూడా PVR టీం తో చర్చలు జరుపుతున్నా కూడా ఆల్ మోస్ట్ అన్ని థియేటర్స్ లో డంకికే షోలు పెట్టడం, నార్త్ లో కూడా సలార్ కి చాలా తక్కువ స్క్రీన్స్ ఇస్తూ ఉండటంతో కలెక్షన్స్ పరంగా అక్కడ సలార్ కి ఎఫెక్ట్ అయ్యేలా ఉంది….డంకి టీం కావాలని చేస్తున్న ఈ పనికి సోషల్ మీడియాలో భారీగా ట్రోల్ చేస్తూ ఉండగా తర్వాత ఏం జరుగుతుంది అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారిందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here