లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన సలార్(Salaar part 1 – ceasefire) సినిమా సాలిడ్ కలెక్షన్స్ ని అందుకున్నా రాంగ్ టైం రిలీజ్ వలన సినిమా సత్తాకి తగ్గ వసూళ్ళని అందుకోలేదు. అయినా కూడా కొన్ని ఏరియాల్లో సాలిడ్ కలెక్షన్స్ ని అందుకోగా….
అందులో నైజాం ఏరియా ముందు నిలుస్తుంది….నైజాంలో సినిమా 60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను అందుకోగా టోటల్ రన్ లో 71.40 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని మమ్మోత్ బిజినెస్ మీద 11.40 కోట్ల ప్రాఫిట్ ను అందుకుంది….అలాంటి విజయం తర్వాత ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ అయిన కల్కి 2898AD( Kalki2898AD Movie) సినిమా….
భారీ అంచనాల నడుమ రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా నైజాం ఏరియాలో సినిమా మరోసారి సాలిడ్ బిజినెస్ ను అందుకుంది. ఈసారి నాన్ రిఫండబుల్ అమౌంట్ రూల్ కింద కాకుండా అన్ని ఏరియాల్లో కూడా కల్కి అడ్వాన్స్ బేస్ మీద భారీ బిజినెస్ ను అందుకోగా నైజాం ఏరియాలో సినిమా ఓవరాల్ గా….
70 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ ను అందుకుంది…70 కోట్లకు పైగా షేర్ ని అందుకుంటే బయర్స్ కి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ సినిమా ఆ టార్గెట్ ను అందుకోక పొతే మట్టుకు మేకర్స్ వచ్చిన లాస్ ను బయర్స్ కి రిటర్న్ ఇవ్వాల్సి ఉంటుంది… ఓవరాల్ గా సలార్ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఇప్పుడు…
కొంత గ్యాప్ తర్వాత బిగ్గెస్ట్ పాన్ ఇండియా రిలీజ్ గా వస్తున్న కల్కి మూవీ అంచనాలను అందుకుంటే ఈ టార్గెట్ ను అందుకోవడం పెద్ద కష్టమేమి కాదని చెప్పాలి. ఇక జూన్ 27న వరల్డ్ వైడ్ గా సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్స్ తో దుమ్ము లేపుతుందో చూడాలి ఇక…