బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నుండి ఫ్యాన్స్ కోరుకునేది పక్కా యాక్షన్ అండ్ కంటెంట్ ఉన్న మూవీ… ఈ మధ్య కాలం లో అన్నీ యాక్షన్ మూవీస్ నే చేసినా అది ఆడియన్స్ ను అలరించే రేంజ్ లో అయితే ఉండటం లేదు. ఇలాంటి టైం లో తను ముఖ్య పాత్ర కాకున్నా తన సోదరి అర్పిత భర్త ఆయుష్ శర్మ విలన్ గా పరిచయం చేస్తూ తన పాత్రని హీరోగా మలిచి చేస్తున్న…
లేటెస్ట్ మూవీ అంతిం ది ఫైనల్ ట్రూత్… పక్కా మాస్ అండ్ ఫుల్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా మరాఠీలో 2018 లో తెరకెక్కిన ముల్షి ప్యాటర్న్ కి అధికారిక రీమేక్…. అందులో పోలిస్ రోల్ చాలా చిన్నది అయినా ఇక్కడ తన చెల్లి భర్త ని ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉండటంతో…
జనాలను థియేటర్స్ కి రప్పించాలి అంటే తన పాత్ర లెంత్ పెరగాలి కాబట్టి ఇందులో హీరోగా చేస్తూ ఆయుష్ శర్మని విలన్ రోల్ లో పెట్టారు.. తను ఆ రోల్ లో అద్బుతంగా సెట్ అవ్వగా డైలాగ్స్ కూడా బాగున్నాయి. కానీ ట్రైలర్ లో మెయిన్ ఫోకస్ అంతా కూడా…
సల్మాన్ చుట్టూనే తిరిగింది అని చెప్పాలి… నిజాయితీగా ఉండే సిక్కు పోలిస్ గా సల్మాన్ ఎప్పుడెప్పుడు యాక్షన్ మొదలు పెడతాడు అని ట్రైలర్ లో ఎదురు చూసేలా చేయగా ఫైట్ మొదలు పెట్టిన తర్వాత దెబ్బకి ఒక విలన్ ని పడేస్తాడు… ఇలా ఫుల్ యాక్షన్ సీన్స్ తో ట్రైలర్ మొత్తం నిండిపోగా సల్మాన్ ఫ్యాన్స్ ఇదంతా సల్మాన్ సోలో మూవీలో చూడాలి అనుకున్న…
రేంజ్ యాక్షన్ సీన్స్ అని… ఇప్పుడు ఈ సినిమాలో స్పెషల్ రోల్ తో ఫుల్ మీల్స్ పెట్టబోతున్నాడు అంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా నవంబర్ 26 న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా ట్రైలర్ రిలీజ్ కి ముందు ఎలా ఉన్నా ఇప్పుడు 100 కోట్ల బొమ్మ అంటూ ట్రేడ్ లో అంచనాలను పెంచేసింది ఈ సినిమా..