బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కి కోపం వచ్చింది… తన సినిమా రివ్యూ ఇచ్చిన ఓ క్రిటిక్ పై మండి పడుతూ ఇలా అంటావా అంటూ కోపం తో లీగల్ గా ఆ క్రిటిక్ పై కేసు వేశాడు. ఇప్పుడు ఆ క్రిటిక్ ఇది కూడా తన గ్రోత్ కి వాడుకుంటూ సల్మాన్ ఇలా నాకు భయపడి కేసు వేశాడు అంటూ పబ్లిసిటీ కి వాడుకుంటున్నాడు. సోషల్ మీడియా లో ఇదే రచ్చ ఇప్పుడు…
సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ రాధే రిలీజ్ అయిన తర్వాత ఆల్ మోస్ట్ అన్ని రివ్యూలు కూడా నెగటివ్ గానే వచ్చాయి, సినిమా రొటీన్ కమర్షియల్ మూవీ మాదిరిగానే ఉందని, ఎలాంటి కొత్తదనం లేదంటూ అందరూ రివ్యూలు ఇచ్చారు. అదే టైం లో బాలీవుడ్ లో…
తనకి తాను నంబర్ 1 క్రిటిక్ అంటూ చెప్పుకుంటూ ఎప్పుడూ వార్తల్లో నిలవాలని చూసే కమల్ ఆర్ ఖాన్ అనే క్రిటిక్ ఈ సినిమా మరింత తీవ్రంగా నెగటివ్ రివ్యూ చేశాడు, ఆ వీడియో కి ఆడియన్స్ నుండి రెస్పాన్స్ అదిరిపోయింది అంటూ ప్రతీ రోజు ఆ వ్యూస్ లెక్కలను సోషల్ మీడియా లో…
షేర్ చేయడం మొదలు పెట్టగా ఇదంతా హీరో దగ్గరికి వెళ్ళడం తో సల్మాన్ కి కోపం వచ్చి లీగల్ గా డిఫమేషన్ కేసు ని వేయగా ఆ లీగల్ నోటిసులు అందుకున్న కమల్ ఆర్ ఖాన్ సోషల్ మీడియా లో సల్మాన్ ఖాన్ నాకు భయపడి ఇలా కేసు వేశాడు చూడండి అంటూ మరింత పబ్లిసిటీ ని తానె స్వయంగా చేసుకుంటున్నాడు.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి ఉంటె పరిస్థితి ఎలా ఉండేదేమో కానీ డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకుని మంచి కలెక్షన్స్ నే సాధించింది. ఇలాంటి టైం లో ఈ కాంట్రవర్సీ పుణ్యమా అని మరింత ఎక్కువ వ్యూస్ అటు క్రిటిక్ రివ్యూ వీడియో కి అలాగే సినిమా కి దక్కడం ఖాయం అంటూ అంతా భావిస్తున్నారు.